త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | యూట్యూబ్‌లో రిలీజైన త‌ర్వాత ఓటీటీలోకి ఆమిర్‌ఖాన్ బాలీవుడ్ మూవీ – ఫ‌స్ట్ హిందీ సినిమా ఇదే

ఆమిర్‌ఖాన్ బాలీవుడ్ మూవీ సితారే జ‌మీన్ ప‌ర్ యూట్యూబ్‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. త్వ‌ర‌లో సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానున్న ఫ‌స్ట్ హిందీ మూవీగా సితారే జ‌మీన్ ప‌ర్ నిల‌వ‌నుంది.

N

Entertainment | Published On Mar 10, 2026, 2.45 pm IST

OTT | యూట్యూబ్‌లో రిలీజైన త‌ర్వాత ఓటీటీలోకి ఆమిర్‌ఖాన్ బాలీవుడ్ మూవీ – ఫ‌స్ట్ హిందీ సినిమా ఇదే
Advertisement

OTT |  సాధార‌ణంగా ఓ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైన త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తుంది. ఆ త‌ర్వాతే టీవీ, యూట్యూబ్‌ల‌లో విడుద‌ల చేస్తుంటారు. ఆమిర్‌ఖాన్ బాలీవుడ్ మూవీ సితారే జ‌మీన్ ప‌ర్ మాత్రం ఈ రూల్‌ను తిర‌గారాసింది. గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. సితారే జ‌మీన్ ప‌ర్‌ డిజిట‌ల్ రైట్స్ కొనేందుకు టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీప‌డ్డాయి. కానీ ఆ ఆఫ‌ర్ల‌ను రిజెక్ట్ చేసిన ఆమిర్‌ఖాన్ నేరుగా యూట్యూబ్‌లో పే ఫ‌ర్ వ్యూ విధానంలో రిలీజ్ చేశారు. ఆమిర్ నిర్ణ‌యంపై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆమిర్‌ఖాన్ మార్కెట్ త‌గ్గ‌డంతోనే యూట్యూబ్‌లో ఈ సినిమాను విడుద‌ల‌ చేశారంటూ ట్రోల్ చేశారు.

ఓటీటీలోకి....

యూట్యూబ్‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత సితారే జ‌మీన్ ప‌ర్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేసింది. కానీ రిలీజ్ డేట్ మాత్రం రివీల్ చేయ‌లేదు. సోనీలివ్ ఓటీటీలో విడుద‌ల కాబోతున్న ఫ‌స్ట్ హిందీ మూవీగా సితారే జ‌మీన్ ప‌ర్ నిల‌వ‌నుంది.

120 కోట్ల బ‌డ్జెట్‌...

సితారే జ‌మీన్ ప‌ర్ మూవీలో ఆమిర్‌ఖాన్‌తో పాటు జెనీలియా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆర్ఎస్ ప్ర‌స‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని ఆమిర్‌ఖాన్ స్వ‌యంగా నిర్మించారు. 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 260 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. స్పానిష్ మూవీ ఛాంపియ‌న్స్‌కు ఆఫీషియ‌ల్ రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

బాస్కెట్‌బాల్ కోచ్‌...

డౌన్ సిండ్రోమ్ అనే స‌మ‌స్య‌ను సందేశాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్ ప్ర‌స‌న్న‌. గుల్ష‌న్ అరోరా బాస్కెట్‌బాల్ కోచ్‌. త‌న కోపం వ‌ల్ల చాలా చోట్ల ఉద్యోగాలు కోల్పోతాడు. డౌన్ సిండ్రోమ్ అనే మాన‌సిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోన్న పిల్ల‌ల‌కు కోచింగ్ ఇచ్చే జాబ్‌లో జాయిన్ అవుతాడు. ఆ పిల్ల‌ల‌కు గుల్ష‌న్ ఎలా శిక్ష‌ణ ఇచ్చాడు? ఈ ట్రైనింగ్ వ‌ల్ల అత‌డి వ్య‌క్తిగ‌త జీవితంలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement