త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Xiaomi Pad 8 | షియోమీ నుంచి స‌రికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్‌.. పీసీలా వాడుకోవ‌చ్చు..

Xiaomi Pad 8 | షియోమీ తన తాజా ఆండ్రాయిడ్ టాబ్లెట్ షియోమీ ప్యాడ్ 8ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌ను అందించారు. ఇది షియోమీ హైప‌ర్ ఓఎస్ 3 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ క‌లిగిన 3.2కె డిస్‌ప్లేను ఇచ్చారు.

S

Technology | Published On Mar 10, 2026, 1.43 pm IST

Xiaomi Pad 8 | షియోమీ నుంచి స‌రికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్‌.. పీసీలా వాడుకోవ‌చ్చు..
Advertisement

Xiaomi Pad 8 | షియోమీ తన తాజా ఆండ్రాయిడ్ టాబ్లెట్ షియోమీ ప్యాడ్ 8ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌ను అందించారు. ఇది షియోమీ హైప‌ర్ ఓఎస్ 3 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ క‌లిగిన 3.2కె డిస్‌ప్లేను ఇచ్చారు. 9,200ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాటరీని ఏర్పాటు చేయ‌డంతోపాటు ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్‌ను ఇచ్చారు. ఈ ట్యాబ్‌కు షియోమీ ఫోక‌స్ పెన్ ప్రొ, కీబోర్డును క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. షియోమీ ప్యాడ్ 8 ప్రారంభ ధరను రూ.33,999గా నిర్ణయించారు. ఈ ధర 8జీబీ, 128జీబీ వేరియంట్‌కు వర్తిస్తుంది. 12జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.36,999 ఉండ‌గా, 12జీబీ, 256జీబీ స్టోరేజ్‌తో వచ్చే నానో టెక్స్చర్ డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.38,999గా ఉంది. అదనంగా కంపెనీ క్రియేట‌ర్స్ ఎడిష‌న్‌ను రూ.41,999కు అందిస్తోంది. అదే నానో టెక్స్చర్ క్రియేటర్స్ ఎడిష‌న్ అయితే రూ.43,999కు ల‌భిస్తోంది.

లాంచింగ్ ఆఫ‌ర్లు..

ఈ టాబ్లెట్ గ్రాఫైట్ గ్రే, టైటానియం బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. మార్చి 17 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, షియోమీ ఇండియా వెబ్‌సైట్, షియోమీ రిటైల్ స్టోర్లు, ఇత‌ర ఆథ‌రైజ్డ్ స్టోర్స్ ద్వారా విక్రయించనున్నారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎస్‌డీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3వేల ఇన్‌స్టంట్‌ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే పూర్తి స్వైప్ చెల్లింపులపై రూ.2,750 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లతో టాబ్లెట్ ప్రారంభ ధర రూ.30,999కు త‌గ్గ‌నుంది. ఈ బ్యాంక్ ఆఫర్ ను మార్చి 31, 2026 వరకు మాత్ర‌మే అందిస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది. అదనంగా మార్చి 17 నుంచి మార్చి 31 మధ్య షియోమీ ప్యాడ్ 8ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఒక సంవత్సరం అదనపు వారంటీ కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ అదనపు వారంటీ బ్యాటరీకి వర్తించదని స్ప‌ష్టం చేసింది.

ఇత‌ర యాక్స‌స‌రీలు..

షియోమీ ప్యాడ్ 8 కవర్ ధరను రూ.1,499గా నిర్ణయించారు. షియోమీ ప్యాడ్ 8 కీ బోర్డు ధర రూ.4,999 కాగా, షియోమీ ఫోక‌స్ పెన్ ప్రొ ధర రూ.5,999గా ఉంది. ఇక షియోమీ ప్యాడ్ 8 ఫోక‌స్ కీబోర్డు ధర రూ.8,999గా ఉంది. ఈ అన్ని డివైస్‌ల‌ను మార్చి 17 నుంచి అమెజాన్, షియోమీ ఇండియా వెబ్‌సైట్, షియోమీ రిటైల్ స్టోర్లలో విక్ర‌యించ‌నున్నారు.

ఏఐ ఫీచ‌ర్ల‌తో..

షియోమీ ప్యాడ్ 8లో 11.2 ఇంచుల 3.2కె డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 144హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, హెచ్‌డీఆర్‌10 కు స‌పోర్ట్‌ను ఇస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా అద్భుతంగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 12జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 256జీబీ వ‌ర‌కు స్టోరేజ్ ల‌భిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆధారిత షియోమీ హైప‌ర్ ఓఎస్ 3ని ఇందులో ఇచ్చారు. అలాగే ప‌లు ఏఐ ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఏఐ రైటింగ్ అసిస్టెన్స్, ఏఐ క్రియేషన్ టూల్స్, లైవ్ ఏఐ సబ్‌టైటిల్స్ వంటి అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా మల్టీటాస్కింగ్, కంప్యూటర్ తరహా బ్రౌజింగ్ అనుభవం కోసం వర్క్‌స్టేషన్ మోడ్ కూడా ఇచ్చారు.

భారీ బ్యాట‌రీ..

షియోమీ ప్యాడ్ 8లో 13 మెగాపిక్స‌ల్ కెమెరాను వెనుక వైపు ఇవ్వ‌గా, ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. వీటితో 4కె వీడియోల‌ను చిత్రీక‌రించుకోవ‌చ్చు. అలాగే డాల్బీ అట్మాస్ ఫీచ‌ర్ ఉన్నందున సౌండ్ క్వాలిటీగా ఉంటుంది. అద్భుత‌మైన మ్యూజిక్‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. హై రిజ‌ల్యూష‌న్ ఆడియో స‌పోర్ట్ క‌లిగిన క్వాడ్ స్పీక‌ర్ల‌ను కూడా ఈ ట్యాబ్‌లో ఇచ్చారు. వైఫై 7, వైఫై 6ఇ, వైఫై డైరెక్ట్‌, మిరాకాస్ట్ వంటి క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. ఏఐ ఆధారిత ఫేస్ అన్ లాక్ ఫీచ‌ర్ ఉంది. ఇందులో ఉన్న 9200 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీకి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ట్యాబ్ వేగంగా చార్జింగ్ అవుతుంది. ఇక ఈ ట్యాబ్‌ను ల్యాప్ టాప్ గా కూడా ఉప‌యోగించుకునే విధంగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్ వేర్‌ను ఇచ్చారు. క‌నుక వినియోగ‌దారులు దీన్ని 2 ఇన్ 1 గా ఉప‌యోగించుకోవ‌చ్చు.

Advertisement
Advertisement