S.Jaishankar | నౌకలపై దాడులు సమంజసం కాదు.. నావికుల మృతిపై భారత్ నిరసన
S.Jaishankar | ఒమన్ తీరంలో (coast of Oman) భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులు (US strikes) చేయడాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jaishankar) తీవ్రంగా తప్పుపట్టారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు సమంజసం కాదని స్పష్టం చేశారు.
S.Jaishankar | ఒమన్ తీరంలో (coast of Oman) భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులు (US strikes) చేయడాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jaishankar) తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio)తో మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఒమన్ తీరంలో ఓ వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో (US Attacks) ముగ్గురు భారతీయ నావికులు (Indian Sailors) మరణించిన ఘటనపై భారత్ తరఫున తీవ్ర నిరసన తెలియజేశారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. శుక్రవారం సాయంత్రం రూబియోతో మాట్లాడినట్లు తన పోస్టులో తెలిపారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు సమంజసం కాదని స్పష్టం చేసినట్లు చెప్పారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారతీయ నౌకలపై ఇరానే దాడి చేసిందని ఆరోపించారు.
పలావు దేశ పతాకంతో వెళ్తున్న 'సెట్టెబెల్లో' (Settebello) అనే చమురు ట్యాంకర్‌పై ఒమన్ గల్ఫ్‌లో అమెరికా సైనిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తోందనే కారణంతో దీనిపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఆ సమయంలో అందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 24 మంది భారతీయ సిబ్బంది కాగా, విదేశీయుల్లో ఇద్దరు పాకిస్థానీలు, ఒకరు ఉక్రెయిన్ , రష్యా వ్యక్తి ఉన్నారు.
దాడి తర్వాత 21 మంది భారతీయ నావికులను ఒమన్ తీర రక్షణ దళం కాపాడింది. ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దురదృష్టవశాత్తూ గల్లంతైనట్లు భావించిన ఆ ముగ్గురు నావికులు మరణించినట్లు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ (Shipping Minister Sarbananda Sonowal) వెల్లడించారు. ఇక ఈ ఘటనపై ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త (USA diplomat) జేసన్ మీక్స్‌కు భారత్ రెండుసార్లు సమన్లు జారీ చేసింది.
Also Read..
అస్సాంలో కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్.. పైలట్ మృతి..!
మహిళా పైలట్‌కు వేధింపులు.. జిమ్ మేనేజర్‌పై కేసు..
ప్రారంభమైన ఎల్‌నినో పరిస్థితులు.. పొంచి ఉన్న కరువు పరిస్థితులు: ఐఎండీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్






