త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Life After Death | చనిపోయి బతికిన మహిళ.. ప్రాణాలు పోయిన ఆ రెండు నిమిషాలు ఆమె ఏం చూసిందో తెలుసా?

గుండె ఆగిపోయి రెండు నిమిషాల పాటు ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ.. ఆ సమయంలో తాను వింతైన లోకానికి వెళ్లానని చెబుతోంది. మరణం తర్వాత అసలు ఏం జరుగుతుందంటే?

J

Viral news | Published On Aug 15, 2026, 11.55 pm IST

Life After Death | చనిపోయి బతికిన మహిళ.. ప్రాణాలు పోయిన ఆ రెండు నిమిషాలు ఆమె ఏం చూసిందో తెలుసా?

సంక్షిప్త సారాంశం

గ్రీస్‌కు చెందిన నికోల్ అనే 49 ఏళ్ల మహిళ ఎమర్జెన్సీ సర్జరీ సమయంలో రెండు నిమిషాల పాటు ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో ఆమె అవతార్ (Avatar) సినిమాలో కనిపించే బ్లూ కలర్ వ్యక్తులను చూసినట్లు వెల్లడించింది. చనిపోయాకే మన అసలైన జీవితం మొదలవుతుందని.. మరణం ఒక అంతం కాదని వాళ్లు టెలిపతీ ద్వారా చెప్పినట్లు వివరించింది. భయం, ద్వేషం వీడి ప్రపంచానికి ప్రేమను పంచడమే మన లక్ష్యం కావాలని ఆమె సందేశం ఇస్తోంది.

Advertisement

Life After Death | త్రినేత్ర.న్యూస్ : మరణం తర్వాత ఏం జరుగుతుంది? మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఈ ప్రశ్నలు ఎప్పటినుంచో మానవాళిని తొలిచివేస్తున్నాయి. కొందరు చనిపోయాక అంతా శూన్యం అంటారు.. మరికొందరు కాంతిమయమైన లోకానికి వెళ్తాం అంటారు. అయితే, గ్రీస్‌ (Greece) కు చెందిన 49 ఏళ్ల ఆర్టిస్ట్ నికోల్ మ్యూస్ (Nicole Meeuws) ఎమర్జెన్సీ సర్జరీ సమయంలో ఊహించని విధంగా రెండు నిమిషాల పాటు ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో ఆమె భౌతికంగా చనిపోయినా.. ఒక వింతైన, ప్రశాంతమైన లోకంలోకి వెళ్లింది. మరణం తర్వాత (Life after death) అసలు ఏం జరుగుతుందో ఆమె స్వయంగా వివరించింది.

ఆ టన్నెల్ గుండా ప్రయాణం

గర్భం దాల్చిన నికోల్.. దురదృష్టవశాత్తు ఆ బిడ్డను కోల్పోయింది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ సర్జరీ (Emergency surgery) చేస్తుండగా ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో తనను ఎవరో ఒక కాంతివంతమైన టన్నెల్ (Tunnel of light) లోకి లాగుతున్నట్లు అనిపించిందని ఆమె తెలిపింది. అక్కడ గాలికి బరువు, ఉష్ణోగ్రత ఉన్నట్లుగా అనిపించిందని.. నీటితో చేసిన మ్యూజిక్ (Music) వినిపిస్తున్నట్లుగా ఫీల్ అయ్యానని చెప్పింది.

అవతార్‌ను తలపించే వింత జీవులు

ఆ కారిడార్ దాటాక.. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు నికోల్ వివరించింది. ఆ ప్రదేశం అంతా సిల్వర్, వయోలెట్, బ్లూ కలర్ లైటింగ్‌తో మెరిసిపోతోంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు సింహాసనాలపై కూర్చుని ఉన్నారు. వాళ్లను చూడగానే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అవతార్' (Avatar) లోని క్యారెక్టర్స్ గుర్తొచ్చాయి. వాళ్ల కళ్లు చాలా పెద్దగా ఉన్నాయని.. బుగ్గలపై చేపలకు ఉండే మొప్పలు, కాళ్లకు బదులు చేప తోకలు ఉన్నాయని తెలిపింది. వాళ్లు నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా.. టెలిపతీ (Telepathy) ద్వారా వాళ్లు చెప్పేదంతా తనకు స్పష్టంగా అర్థమైందని పేర్కొంది.

మరణం ఒక అంతం కాదు.. భ్రమ

ఆ వింత జీవులు నికోల్‌కు ఒక గొప్ప సందేశాన్నిచ్చారు. "మన జీవితం ఒక భ్రమ (Illusion). మనం చనిపోయాకే మన అసలైన జీవితం మొదలవుతుంది" అని వాళ్లు చెప్పారు. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందని.. తిరిగి భూమి మీదకు రాబుద్ధి కాలేదని నికోల్ తెలిపింది. అదే మనందరి అసలైన ఇల్లు (True Home) అని ఆమె గట్టిగా నమ్ముతోంది.

తిరిగి ప్రాణాలతో

కొన్ని నిమిషాల తర్వాత ఆమె ఆత్మ తిరిగి ఫిజికల్ బాడీ (Physical body) లోకి ప్రవేశించింది. ఆ సమయంలో తన పక్కనే ఉన్న భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. డాాల్ఫిన్స్ (Dolphins) చేసే శబ్దాలు మాత్రమే ఆమె గొంతులోంచి వచ్చాయట. కొన్ని నిమిషాల తర్వాత ఆమె సాధారణ స్థితికి చేరుకుంది.

తన జీవిత లక్ష్యం పిల్లల్ని కనడం కాదని.. ఆ ప్రపంచం గురించి మనందరికీ తెలియజేయడమే తన అసలైన మిషన్ అని నికోల్ చెబుతోంది. ద్వేషం, భయం వదిలేసి.. ప్రేమను పంచడమే మనుషులుగా మన విధి అని ఆమె స్పష్టం చేస్తోంది. మరణం తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలిసిపోయింది కాబట్టి.. ఇప్పుడు తనకు చావు అంటే అస్సలు భయం లేదని ఆమె ధైర్యంగా చెబుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement