Gen Z Job Rejection | కోటి రూపాయల ప్యాకేజీని వదులుకున్న 25 ఏళ్ల కుర్రాడు.. కారణం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు
చేతికి వచ్చిన కోటి రూపాయల జాబ్ ఆఫర్‌ను ఓ 25 ఏళ్ల యువకుడు సింపుల్‌గా రిజెక్ట్ చేశాడు. దానికి అతడు చెప్పిన కారణం వింటే మీరు కూడా షాక్ అవుతారు.
Viral news | Published On Aug 16, 2026, 2.00 am IST
- 25 ఏళ్ల యువకుడు ఏకంగా రూ.1 కోటి ప్యాకేజీతో వచ్చిన జాబ్ ఆఫర్ రిజెక్ట్
- టాక్సిక్ వర్క్‌ప్లేస్ (Toxic workplace) లో పనిచేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
- ఈ ఆసక్తికర విషయాన్ని ముస్కాన్ అత్తార్ అనే మహిళ లింక్డ్‌ఇన్ (LinkedIn) లో షేర్
- ప్రస్తుత యువత (Gen Z) కేవలం డబ్బు కంటే కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్, కెరీర్ గ్రోత్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని నెటిజన్ల చర్చ
Gen Z Job Rejection | త్రినేత్ర.న్యూస్ : ఏటా కోటి రూపాయల జీతం అనగానే ఎవరైనా ఎగిరి గంతేసి ఆ ఉద్యోగంలో చేరిపోతారు. కానీ, ఓ 25 ఏళ్ల యువకుడు (Gen Z candidate) మాత్రం తనకు వచ్చిన రూ.1 కోటి జాబ్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. దీనికి కారణం.. ఆ కంపెనీలో ఉండే టాక్సిక్ వర్క్ కల్చర్ (Toxic workplace). యువత మైండ్‌సెట్, కెరీర్ గ్రోత్, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చుట్టూ తిరుగుతున్న ఈ సంఘటన ఇప్పుడు ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ వైరల్
ముస్కాన్ అత్తార్ (Muskan Atar) అనే ప్రొఫెషనల్ తన స్నేహితుడికి ఎదురైన ఈ అనుభవాన్ని లింక్డ్‌ఇన్ (LinkedIn) లో పంచుకున్నారు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆఫర్‌ను కాదనుకోవడం మామూలు విషయం కాదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకైతే ఆ 25 ఏళ్ల వయసులో ఇంత క్లారిటీ ఉండేది కాదని.. కుటుంబ బాధ్యతలు, ప్రెషర్ వల్ల కచ్చితంగా ఆ కోటి రూపాయల ఆఫర్‌కు ఓకే చెప్పేదాన్నని ఆమె రాసుకొచ్చారు.

డబ్బు కంటే ప్రశాంతతే ముఖ్యం
తన స్నేహితుడు కూడా తనలాగే సాధారణ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇలాంటి షార్ట్-టర్మ్ లాభాలను వదులుకోవడం గ్రేట్ అని ముస్కాన్ కొనియాడారు. నేటి తరం (Gen Z) ఉద్యోగులకు తమకు ఏం కావాలో పూర్తి స్పష్టత ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆమె అన్నారు. కేవలం అత్యధిక ప్యాకేజీని మాత్రమే చూసుకోకుండా.. ప్రశాంతమైన వాతావరణం ఎక్కడుంటుందో చూసుకుని మరీ కెరీర్‌ను ఎంచుకుంటున్నారని.. రాబోయే రోజుల్లో కంపెనీలు కూడా యువత ఆకాంక్షలకు తగ్గట్టు మారక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు.
నెటిజన్ల మిక్స్‌డ్ రియాక్షన్స్
ముస్కాన్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కోటి రూపాయల ఆఫర్ వదులుకోవడం చెప్పడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో చాలా కష్టమని పలువురు కామెంట్ చేస్తున్నారు. "నా మిడిల్ క్లాస్ మైండ్‌సెట్‌కు 45 ఏళ్ల వయసులో కూడా ఆ ఆఫర్ వదులుకునే ధైర్యం రాదు, దయచేసి ఆ ఆఫర్ ఏదో నాకే పంపొచ్చుగా" అని ఒకరు సరదాగా స్పందించారు.
మరికొందరు మాత్రం.. చేతిలో సరిపడా ఫైనాన్షియల్ సెక్యూరిటీ (Financial security) ఉన్నవాళ్లకే ఇలాంటి lucrative జాబ్ వదులుకునే సౌలభ్యం ఉంటుందని, గత తరాలకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదని, ఆర్థిక బాధ్యతలు ఉన్నవారు అంత ఈజీగా ఆఫర్లను వదులుకోలేరని వాదిస్తున్నారు. మరోవైపు, భవిష్యత్తులో కేవలం జీతం చూసుకునే వాళ్ల కంటే.. పర్పస్, వెల్‌బీయింగ్ (Wellbeing) కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లే వర్క్ కల్చర్‌ను శాసిస్తారని ఇంకొందరు కామెంట్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
అక్టోబర్ 2, 2026

Startup Culture India | డ్యూటీ అయ్యాక పడుకుంటే ‘అన్‌ప్రొఫెషనల్’ అంటారా? స్టార్టప్ కల్చర్‌పై భగ్గుమంటున్న నెటిజన్లు
జులై 9, 2026

Layoff Stories | సంతోషంగా ఊరికి పయనమైన యువకుడు.. దారి మధ్యలో లేఆఫ్ మెయిల్.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టోరీ!
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్
- ●Kakatiya Kala Thoranam | రూ.10 లక్షల బిడ్‌తో టాప్-3లో కాకతీయ కళాతోరణం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్

Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ



