CPI Narayana | సీపీఐ నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం.. జీవిత సంపాదనంతా విరాళమిస్తున్నట్లు ప్రకటన
CPI Narayana | నేటివరకు రాజకీయాలకతీతంగా ప్రశంసలు అందుకున్న సీపీఐ నేత నారాయణ దంపతులు మరో చారిత్రక నిర్ణయం తీసుకుని స్ఫూర్తిగా నిలిచారు. తమ జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి దానం చేస్తున్నట్లు ప్రకటించారు.
- లాల్‌సలాం కామ్రేడ్ అంటూ నెటిజన్ల కామెంట్లు
- రాజకీయాలకతీతంగా వెల్లువెత్తిన ప్రశంసలు
CPI Narayana | త్రినేత్ర.న్యూస్: నేటివరకు రాజకీయాలకతీతంగా ప్రశంసలు అందుకున్న సీపీఐ నేత నారాయణ దంపతులు మరో చారిత్రక నిర్ణయం తీసుకుని స్ఫూర్తిగా నిలిచారు. తమ జీవితాంతం సంపాదించిన మొత్తం ఆస్తిని వృద్ధాశ్రమానికి దానం చేస్తున్నట్లు ప్రకటించారు. వందలాది మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపేలా వారు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు.
సమాజ సేవే లక్ష్యంగా నారాయణ దంపతులు ఆస్తి విరాళం ప్రకటించారు. వీరు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పలువురు కామ్రేడ్ నారాయణ దంపతులకు లాల్ సలాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా నిలిచారని కొనియాడుతున్నారు.
వృద్ధాశ్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించాలన్న సంకల్పంతో వారు తమ ఆస్తిని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. సేవాభావం, సామాజిక బాధ్యతతో తీసుకున్న నిర్ణయంపై రాజకీయాలకు అతీతంగా వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన ఎంతో గొప్పదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్




