త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ

PM Modi | అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగినప్పటికీ రైతులు (farmers) అత్యధికంగా వినియోగించే యూరియా (Urea), DAP ఎరువులను త‌క్కువ ధ‌ర‌కే అందిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Modi) తెలిపారు. ప్రపంచ మార్కెట్లో రూ. 3,000 ఉన్న యూరియా (Urea) బస్తాను ప్ర‌భుత్వం సబ్సిడీ భరిస్తూ రైతులకు కేవలం రూ. 300కే అందిస్తున్న‌ట్లు చెప్పారు. అంతేకాదు, రూ.5,000 పైగా ఉన్న డీఏపీ (DAP) బస్తాను రూ.1,350కే పంపిణీ చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

D

National | Published On Aug 15, 2026, 4.39 pm IST

PM Modi | రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగినప్పటికీ రైతులు (farmers) అత్యధికంగా వినియోగించే యూరియా (Urea), DAP ఎరువులను సరసమైన ధరలకే అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవం (Independence Day) సందర్భంగా ఎర్రకోట (Red Fort) నుంచి జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా రైతుల వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించి, వారి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప‌రిణామాల ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు నాగ‌రిక్‌ దేవో భ‌వ (Nagrik Devo Bhava) అనే సూత్రాన్ని అనుస‌రించిన‌ట్లు చెప్పారు. ప్రపంచ మార్కెట్లో రూ. 3,000 ఉన్న యూరియా బస్తాను ప్ర‌భుత్వం సబ్సిడీ భరిస్తూ రైతులకు కేవలం రూ. 300కే అందిస్తున్న‌ట్లు చెప్పారు. అంతేకాదు, రూ.5,000 పైగా ఉన్న డీఏపీ (DAP) బస్తాను రూ.1,350కే పంపిణీ చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

2047 నాటికి విక‌సిత్‌ భారత్ సాధనే లక్ష్యంగా దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని స్వావలంబన దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని ఈసంద‌ర్భంగా మోదీ నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారి, యుద్ధాలు, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అనేక సవాళ్లు ఎదురైనా భారత్‌ తన అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించిందని చెప్పారు. నేడు మ‌న దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, యూరియా కొర‌త లేకుండా అందుబాటులో ఉన్నాయ‌ని వివ‌రించారు.

'సప్తధార' రోడ్‌మ్యాప్‌

దేశ భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన 'సప్తధార' రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. దేశ భవిష్యత్‌ అభివృద్ధికి కీలకమైన ఏడు రంగాలను ‘శక్తి సప్తధార’గా అభివర్ణించారు. తయారీ రంగం, వ్యవసాయం, సాంకేతికత, గతి శక్తి , రక్షణ రంగంలో స్వావలంబన, గ్రీన్‌ అండ్‌ బ్లూ ఎకానమీ, భారత సాఫ్ట్‌ పవర్‌ వంటి ఏడు కీలక రంగాలను దేశ ప్రగతికి చోదక శక్తులుగా పేర్కొన్నారు.

Also Read..

యువ‌త చ‌రిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏక‌మ‌వ్వాలి

కూతురు వ‌య‌సున్న హీరోయిన్‌తో డేటింగ్ - బాలీవుడ్ హీరోపై భార్య సంచ‌ల‌న కామెంట్లు

పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు.. డీజిల్‌పైనా పన్ను కోత : సామాన్యులకు కేంద్రం ఊరటనిచ్చిందా?

Advertisement
Advertisement