త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramachander Rao | సింగ‌రేణి కార్మికుల హ‌క్కుల‌ను కాపాడేది బీజేపీనే : ఎన్ రామ‌చంద‌ర్ రావు

N Ramachander Rao | కష్టపడి పనిచేసే సింగరేణి కార్మికులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది అని బీజేపీ చీఫ్ ఎన్ రామ‌చంద‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. వారి హక్కులు, సంక్షేమం, భవిష్యత్తు పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Jul 14, 2026, 2.41 pm IST

N Ramachander Rao | సింగ‌రేణి కార్మికుల హ‌క్కుల‌ను కాపాడేది బీజేపీనే : ఎన్ రామ‌చంద‌ర్ రావు
Advertisement

N Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : కష్టపడి పనిచేసే సింగరేణి కార్మికులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది అని బీజేపీ చీఫ్ ఎన్ రామ‌చంద‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. వారి హక్కులు, సంక్షేమం, భవిష్యత్తు పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అని ఆయ‌న తెలిపారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గోదావరిఖని ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని వద్ద సింగరేణి కార్మికులను ఉద్దేశించి రామ‌చంద‌ర్ రావు ప్ర‌సంగించారు.

దశాబ్దాలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను, అహర్నిశలు శ్రమించే సింగరేణి కార్మికులను నిర్లక్ష్యం చేశాయి. దీనికి భిన్నంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్తుకు అత్యున్నత ప్రాధాన్యం లభిస్తోందన్నారు.

తాడిచర్ల-II కోల్ బ్లాక్‌ను SCCLకు నేరుగా కేటాయిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం సింగరేణిని మరింత బలోపేతం చేయడంతో పాటు, రాబోయే దశాబ్దాల పాటు సంస్థ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఈ నిర్ణయం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించి, వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల జీవితాల్లో దీర్ఘకాలిక శ్రేయస్సును తీసుకురానుందని రామ‌చంద‌ర్ రావు తెలిపారు.

అప్పుల భారంతో కుంగిపోయిన SCCLను పునరుజ్జీవింపజేసి, దాని భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ దూరదృష్టి నాయకత్వంలోని ఎన్డీఏ (NDA) కేంద్ర ప్రభుత్వం మాత్రమే కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంకితభావంతో కూడిన నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమైంది. వారి అచంచల సంకల్పం ఫలితంగానే చారిత్రాత్మకమైన తాడిచర్ల-II బొగ్గు బ్లాక్‌ను నేరుగా SCCLకు కేటాయించడం జరిగింది. ఈ నిర్ణయం SCCLను మరింత బలోపేతం చేయడమే కాకుండా, వేలాది మంది సింగరేణి కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించి, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ, రాబోయే తరాలకు దీర్ఘకాలిక అభివృద్ధి, శ్రేయస్సుకు బాటలు వేయనుంది అని రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement