Arvind Kejriwal | పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని ఆప్షనల్ చేయాలి.. ప్రధాని మోదీకి లేఖ రాసిన కేజ్రీవాల్
Arvind Kejriwal | పెట్రోల్ పంపుల్లో E20, E10, E0 వేరియంట్లను విడివిడిగా అందుబాటులో ఉంచాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లేఖ రాశారు.
Arvind Kejriwal | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లేఖ రాశారు. వినియోగదారులపై బలవంతంగా E20 ఇంధనాన్ని (E20 Fuel) రుద్దకుండా, పెట్రోల్ పంపుల్లో E20, E10, E0 వేరియంట్లను విడివిడిగా అందుబాటులో ఉంచాలని కోరారు.
ప్రజలు తమకు నచ్చిన పెట్రోల్‌ను ఎంచుకునే వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. "ఎవరికైనా స్వచ్ఛమైన పెట్రోల్ కావాలంటే వారికి ఆ ఆప్షన్ ఉండాలి. అలాగే ఇథనాల్ కలిపిన పెట్రోల్ కావాలంటే వారికి ఆ ఛాయిస్ ఇవ్వాలి" అని అన్నారు. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే, ఇథనాల్ కలిపిన ఇంధనం (ఈ20) తక్కువ మైలేజీని ఇస్తుందని కేజ్రీ పేర్కొన్నారు. అందువల్ల E20 పెట్రోల్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు.
E20 పెట్రోల్‌తో ఎదురవుతున్న సమస్యలపై తమ అనుభవాలను పంచుకోవాలని పౌరులను కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించినట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. మైలేజ్ సహా ఇతర సమస్యలపై ప్రజలు తమ ఆందోళనలను పంచుకోవాలని సూచించారు. ఈ పిటిషన్‌పై సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సేకరించిన ప్రజా స్పందనలను తాను స్వయంగా ప్రధాని మోదీకి అందజేస్తానని కేజ్రీ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Alia Bhatt | కెరీర్లో ఫస్ట్ టైమ్ హారర్ మూవీలో అలియా భట్ - నిమిషానికి కోటి రెమ్యూనరేషన్?
- ●Srisailam Temple Matchbox Saree | శ్రీశైలం అమ్మవారికి సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక
- ●commercial shipping | వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపండి.. ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు
- ●Sea Planes | హుస్సేన్ సాగర్ టు ప్రకాశం బ్యారేజీ.. సీ ప్లేన్లు నడపాలన్న సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mutual Funds | షేర్లు, మ్యూచువల్ ఫండ్లను అమ్మితే వచ్చే లాభంపై పన్ను చెల్లించాలా.. రూల్స్ ఎలా ఉన్నాయి..

Alia Bhatt | కెరీర్లో ఫస్ట్ టైమ్ హారర్ మూవీలో అలియా భట్ - నిమిషానికి కోటి రెమ్యూనరేషన్?

Srisailam Temple Matchbox Saree | శ్రీశైలం అమ్మవారికి సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక

commercial shipping | వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపండి.. ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు

Sea Planes | హుస్సేన్ సాగర్ టు ప్రకాశం బ్యారేజీ.. సీ ప్లేన్లు నడపాలన్న సీఎం రేవంత్






