త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | భారత్‌ను గర్వపడేలా చేశారు.. స్కైరూట్‌ బృందాన్ని ప్ర‌శంసించిన ప్ర‌ధాని మోదీ

PM Modi | ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) ప్ర‌యోగం విజ‌య‌వంత‌మ‌వ‌డంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు స్కైరూట్‌ బృందానికి మోదీ స్వ‌యంగా ఫోన్‌ చేసి అభినందించారు.

D

National | Published On Jul 18, 2026, 2.03 pm IST

PM Modi | భారత్‌ను గర్వపడేలా చేశారు.. స్కైరూట్‌ బృందాన్ని ప్ర‌శంసించిన ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైన విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే స్కైరూట్‌ బృందానికి మోదీ స్వ‌యంగా ఫోన్‌ చేసి అభినందించారు. దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశారంటూ కొనియాడారు.

విక్ర‌మ్ రాకెట్ క‌క్ష‌లోకి చేరిన వెంట‌నే సతీశ్ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో శాస్త్ర‌వేత్త‌లు స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో స్కైరూట్ సీఈవో, వ్యవస్థాపకులు పవన్‌కుమార్ చందన్‌కు మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. "మీరు భారత్‌ను గర్వపడేలా చేశారు. భారత ఆశయాలను అంతరిక్షంలో నిలబెట్టారు. యువత కలలకు బలమైన పునాది వేశారు" అని అన్నారు. ఈ ప్ర‌యోగాన్ని తానూ వీక్షించిన‌ట్లు చెప్పారు. ఈ మిష‌న్ తొలి అడుగు మాత్ర‌మేన‌ని.. దీన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను క‌ల‌వాల‌ని స్కైరూట్‌ బృందాన్ని ప్ర‌ధాని ఆహ్వానించారు.

Also Read..

విద్యార్థుల భ‌ద్ర‌త‌కై విద్యా వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాలి : రాహుల్ గాంధీ

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన శ‌శి థ‌రూర్‌

ఏటూరు నాగారంలో భారీ వ‌ర్షం.. 115.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు

Advertisement
Advertisement