త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | ఏటూరు నాగారంలో భారీ వ‌ర్షం.. 115.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు

Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు కురియ‌గా, మ‌రికొన్ని ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షాలు( Moderate Rains ) కురిశాయి. అయితే ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం( Eturunagaram )లో భారీ వ‌ర్షం కురిసింది. గ‌త 24 గంట‌ల్లో ఆ ప్రాంతంలో 115.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ( TGDPS ) వెల్ల‌డించింది.

S

Telangana | Published On Jul 18, 2026, 1.58 pm IST

Heavy Rains | ఏటూరు నాగారంలో భారీ వ‌ర్షం.. 115.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు
Advertisement

Heavy Rains | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు కురియ‌గా, మ‌రికొన్ని ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షాలు( Moderate Rains ) కురిశాయి. అయితే ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం( Eturunagaram )లో భారీ వ‌ర్షం కురిసింది. గ‌త 24 గంట‌ల్లో ఆ ప్రాంతంలో 115.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ( TGDPS ) వెల్ల‌డించింది. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో 25 రోజుల త‌ర్వాత ప‌శ్చిమ‌, మ‌ధ్య హైద‌రాబాద్‌లో మోస్త‌రు వ‌ర్షం కురిసింది. క్యూర్ ప‌రిధిలోని గ‌చ్చిబౌలిలో అత్య‌ధికంగా 23 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు టీజీడీపీఎస్ ప్ర‌క‌టించింది. ఈస్ట్ హైద‌రాబాద్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వాన కుర‌వ‌లేదు. ఇక శ‌నివారం ఉద‌యం నుంచి కూడా రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో న‌మోదైన వ‌ర్షపాతం

గ‌చ్చిబౌలి - 23.0 మి.మీ.
ఆదిభ‌ట్ల - 22.5 మి.మీ.
లింగంప‌ల్లి - 21.0 మి.మీ.
బ‌హ‌దూర్ పురా - 20.8 మి.మీ.
ఆసిఫ్‌న‌గ‌ర్ - 20.0 మి.మీ.
పీజేఆర్ స్టేడియం - 19.5 మి.మీ.

తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వ‌ర్ష‌పాతం వివ‌రాలిలా..

ఏటూరు నాగారం - 115.3 మి.మీ.
గీసుగొండ - 74 మి.మీ.
పైడిప‌ల్లి - 63.5 మి.మీ.
ములుగు రోడ్ - 61.8 మి.మీ.
ధ‌రూర్ - 58.3 మి.మీ.
కాజీపేట్ - 56.8 మి.మీ.

Advertisement
Advertisement