PM Modi | చొరబాటుదారులు తమ లగేజ్‌ని సర్దుకోవాలి.. బెంగాల్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ
PM Modi | ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం రాష్ట్రంలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు.
PM Modi | ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం రాష్ట్రంలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో కమలం పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి టీఎంసీ (TMC) నేతల్లో భయంపుట్టిందని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ప్రధాని విమర్శించారు.
పూర్బాబర్ధమాన్ జిల్లాలోని కత్వాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA) కింద పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మతువా, నమశూద్ర శరణార్థ కుటుంబాలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. దేశ రాజ్యాంగం వారి రక్షణగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సీఏఏ చట్టాన్ని అమలు చేయడం ద్వారా శరణార్థులకు పౌరసత్వం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆరోపించారు.
అదే సమయంలో అక్రమ చొరబాటుదారుల అంశంపై కూడా ప్రధాని మాట్లాడారు. చొరబాటుదారులు తమ సామాన్లు సర్దుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చొరబాటుదారులు బెంగాల్ విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రధాని హెచ్చరించారు. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమతా సర్కార్ ప్రజలకు భయమే మిగిల్చిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదిలా ఉండగా, 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.
Also Read..
మహిళా కోటాను ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది.. కేంద్రంపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆరోపణలు
షాకింగ్.. హర్మూజ్ జలసంధిలో సీమైన్స్‌ను గుర్తించలేకపోతున్న ఇరాన్..!
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






