Strait of Hormuz | షాకింగ్.. హర్మూజ్ జలసంధిలో సీమైన్స్‌ను గుర్తించలేకపోతున్న ఇరాన్..!
Strait of Hormuz | అమెరికా-ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినా ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మాత్రం పూర్తిగా తెరుచుకోలేదు. అందుకు కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ అమర్చిన సీమైన్సే (Sea Mines) కారణమట.
International | Published On Apr 11, 2026, 1.21 pm IST
Strait of Hormuz | అమెరికా-ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినా ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మాత్రం పూర్తిగా తెరుచుకోలేదు. అందుకు కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ అమర్చిన సీమైన్సే (Sea Mines) కారణమట. వీటిని తొలగించడంలో ఇరాన్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. శత్రు దేశాలను అడ్డుకునేందుకు హడావుడిగా సీమైన్స్‌ను అమర్చిన ఇరాన్.. ఇప్పుడు వాటిని గుర్తించలేకపోతోందట. అవి ఎక్కడున్నాయో ఇరాన్‌కు తెలియడం లేదని అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక నివేదించింది. ఈ కారణం చేతనే హర్మూజ్ జలసంధిని ఇరాన్ తిరిగి పూర్తి స్థాయిలో తెరవలేకపోతోందని సదరు నివేదిక పేర్కొంది.
కాగా, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన వెంటనే ఇరాన్ అప్రమత్తమైంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. ఈ మార్గంలో నౌకల ప్రయాణానికి అనుమతించలేదు. ఒక వేళ తమను కాదని ఈ జలసంధిని దాటాలని చూస్తే నౌకలను పేల్చేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించింది. దీంతో ఈ మార్గంలో రవాణా ఆగిపోయింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. అంతటితో ఆగని టెహ్రాన్.. చిన్న చిన్న పడవలను ఉపయోగించి ఈ జలమార్గంలో మైన్లను పరిచింది. ఈ ప్రక్రియ వేగంగా గానీ, సమర్థవంతంగా గానీ జరగలేదని అమెరికా అధికారులు గుర్తించారు.
ఈ మైన్లను ఎలాంటి ముందస్తు ప్రణాళికా లేకుండా అస్తవ్యస్తంగా అమర్చారని యూఎస్ అధికారులు తెలిపారు. మైన్స్‌ను పరిచిన స్థానాలను ఇరాన్ పూర్తిగా రికార్డ్ చేసిందో లేదో కూడా స్పష్టత లేదని పేర్కొన్నారు. ఒకవేళ రికార్డు చేసినప్పటికీ కొన్ని మైన్స్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందువల్లే వాటిని తిరిగి వెలికితీయడం మరింత కష్టతరమవుతుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.
అయితే, ఇప్పుడు అమెరికాతో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్.. హర్మూజ్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జలసంధిలో అమర్చిన సీమైన్స్‌ను తొలగించాలని చూస్తోంది. కానీ వాటిని ఇరాన్ గుర్తించలేకపోతోందంట. ఈ క్రమంలోనే జలసంధి గుండా వెళ్లే నౌకలకు ఇరాన్ కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. జలసంధిలో పలు చోట్ల సముద్రపు మందుపాతరలు ఉన్నాయని.. అందుకే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచిస్తోంది. ఈ మేరకు కొన్ని కొత్త మార్గాల మ్యాప్‌లను కూడా టెహ్రాన్ విడుదల చేసింది. కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ కీలకమైన జలసంధి తెరవడం ఇరాన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read..
అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దని చెబుతున్న పరిశోధకులు.. ఎందుకంటే..?
పార్లమెంట్ వద్ద ఆసక్తికర పరిణామం.. ప్రధాని మోదీ, రాహుల్ మధ్య స్నేహపూర్వక సంభాషణ
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫస్ట్ డే కలెక్షన్స్ - కృతి శెట్టి ఖాతాలో మరో డిజాస్టర్ ఖాయమేనా?
సంబంధిత వార్తలు

US Iran Peace Memo | అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు? ‘వన్-పేజీ’ ఒప్పందంతో శాంతి చర్చలకు మార్గం
మే 6, 2026

Strait of Hormuz | ఇరాన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: హార్ముజ్ జలసంధి ఓపెనింగ్‌పై వీడని సస్పెన్స్
మే 2, 2026

Iran US conflict | హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ఇరాన్ 3 కండిషన్లు.. ట్రంప్ ఒప్పుకుంటారా?
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



