KCR | సామాజిక న్యాయం కోసం పోరాడిన దార్శనికుడు ఫూలే : కేసీఆర్
KCR | భారత సమాజంలో వర్ణ, కుల, లింగ వివక్షతను రూపుమాపి, సామాజిక న్యాయం కోసం పోరాడిన దార్శనికుడు మహాత్మాఫూలే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : భారత సమాజంలో వర్ణ, కుల, లింగ వివక్షతను రూపుమాపి, సామాజిక న్యాయం కోసం పోరాడిన దార్శనికుడు మహాత్మాఫూలే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళులర్పించి.. వారు జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
సబ్బండ వర్ణాలు సామాజిక ఆర్థిక రంగాల్లో ముందడుగు వేయాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పిన జ్యోతిరావు ఫూలే ఆశయాలు ఎల్లకాలం ఆచరణీయం. తన భార్య సావిత్రి బాయి ఫూలేకు చదువు నేర్పించి మరీ, చదువు నిరాకరించబడిన భారత మహిళకు విద్య నేర్పాలనే ధృఢ సంకల్పాన్ని అనేక కష్ట నష్టాల నడుమ అమలు చేసిన, మహిళాభ్యుదయ మార్గదర్శి మహాత్మా ఫూలే అని కొనియాడారు.
ఫూలే ఆశయాలను నిజం చేస్తూ, తన పదేండ్ల ప్రగతి పాలనలో, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అమలు చేసి ఫలితాలను సాధించిన పలు రకాల పథకాలను కార్యాచరణను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సాగునీరు, విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసి వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచామని తెలిపారు. పలు వృత్తికులాలను ప్రోత్సహిస్తూ గొర్రెల పెంపకం, చేపల పంపిణీ, నేతన్నకు చేయూత వంటి పథకాలను అమలు చేయడం ద్వారా నూటికి తొంభైశాతంగా ఉన్న దళిత బహుజన కులాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని తెలిపారు. తద్వారా, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం జరిగిందని అన్నారు.
ఆసరా ఫించన్లు, బీసీ బంధు వంటి బహుజన సంక్షేమ పథకాల అమలు ద్వారా, వెనకబడి ఉన్న సబ్బండ కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేసామన్నారు. బీసీ కులాల విద్యకోసం ప్రత్యేక రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి వారికి అంతర్జాతీయ స్థాయి విద్యనందించినామని కేసీఆర్ తెలిపారు. బీసీ బిడ్డల భవిష్యత్తు తరాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు రాష్ట్ర రాజధాని నగరం హైద్రాబాద్ లో ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం, అత్యంత విలువైన స్థలాలను, నిర్మాణ నిధులను,బీసీ కుల సంఘాలకు కేటాయించినామని తెలిపారు. బీసీ కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఫూలే ఆశయాలకు అనుగుణంగా తాము గత ప్రభుత్వంలో అమలులోకి తెచ్చిన ప్రగతి కార్యాచరణను చిత్తశుద్దితో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తద్వారా మాత్రమే మహాత్మాఫూలేకు మనం ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్ఠం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



