త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi-Rahul Gandhi | పార్ల‌మెంట్ వ‌ద్ద ఆస‌క్తిక‌ర ప‌రిణామం.. ప్ర‌ధాని మోదీ, రాహుల్ మ‌ధ్య స్నేహపూర్వ‌క సంభాష‌ణ‌

PM Modi-Rahul Gandhi | మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతి నేడు. ఈ సందర్భంగా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi), ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మ‌ధ్య ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది.

D

National | Published On Apr 11, 2026, 12.11 pm IST

PM Modi-Rahul Gandhi | పార్ల‌మెంట్ వ‌ద్ద ఆస‌క్తిక‌ర ప‌రిణామం.. ప్ర‌ధాని మోదీ, రాహుల్ మ‌ధ్య స్నేహపూర్వ‌క సంభాష‌ణ‌
Advertisement

PM Modi-Rahul Gandhi | మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతి నేడు. ఈ సందర్భంగా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi), ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మ‌ధ్య ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. మ‌హాత్మా ఫూలేకి నివాళుల‌ర్పించేందుకు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని ప్రేర‌ణ్ స్థ‌ల్ (Prerna Sthal) వ‌ద్ద‌కు చేరుకున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.. కారు దిగి అక్క‌డే ఉన్న ప‌లువురి నేత‌ల‌తో మాట్లాడారు.

రాహుల్‌ను సైతం ప‌ల‌కరించారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ కాసేపు మాట్లాడుతూ క‌నిపించారు. అయితే, వారి మ‌ధ్య ఎలాంటి సంభాష‌ణ జ‌రిగింద‌న్న‌ది తెలియ‌రాలేదు. మోదీ మాట్లాడుతుండ‌గా.. రాహుల్ త‌ల ఊపుతూ స‌మాధానం ఇస్తూ క‌నిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. నిత్యం ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకునే నేత‌లు ఇలా నివాళి వేదిక‌పై రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి పరస్పరం మాట్లాడుకోవడం, స్నేహపూర్వకంగా పలకరించుకోవడం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ త‌ర్వాత ప్ర‌ధాని మాట్లాడుతూ.. జ్యోతిరావ్ ఫూలే సమాజానికి వెలుగునిచ్చిన మహానుభావుడ‌ని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటికీ సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మనందరికీ ప్రేరణ అని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.

Also Read..

‘ఉత్త‌మ అధికారిని దూషించిన క‌మిష‌న‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి’

పాకిస్థాన్ చేరుకున్న అమెరికా-ఇరాన్ ప్ర‌తినిధుల బృందాలు

మినాబ్ మృతుల కోసం విమానంలో ఒక్కోసీటు.. ర‌క్తంతో త‌డిసిన బ్యాగులు, బూట్లు కూడా

Advertisement
Advertisement