Peace Talks | పాకిస్థాన్ చేరుకున్న అమెరికా-ఇరాన్ ప్రతినిధుల బృందాలు
Peace Talks | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి చర్చలకు (Peace Talks) పాకిస్థాన్ వేదికైంది. ఈ చర్చల కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అత్యంత కీలకమైన దౌత్య సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న ఇస్లామాబాద్‌పైనే అందరి దృష్టి పడింది.
International | Published On Apr 11, 2026, 11.50 am IST
Peace Talks | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి చర్చలకు (Peace Talks) పాకిస్థాన్ వేదికైంది. ఈ చర్చల కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అత్యంత కీలకమైన దౌత్య సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న ఇస్లామాబాద్‌పైనే అందరి దృష్టి పడింది. ఇక ఈ చర్చల కోసం రెండు దేశాల ప్రతినిధుల బృందాలు పాక్‌కు చేరుకున్నాయి.
అమెరికాతో చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం (Iranian Delegation) శనివారం తెల్లవారుజామున ఇస్లామాబాద్ (Islamabad)కు చేరుకుంది. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ (Mohammad Bagher Ghalibaf) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొననుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన రెండు విమానాలు ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వీరికి పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తోపాటూ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ మొహ్సిన్ రజా నఖ్వీ తదితర అధికారులు స్వాగతం పలికారు.
పాక్‌కు చేరుకున్న జేడీ వాన్స్
ఆ తర్వాత కాసేపటికే అమెరికా ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. ఉదయం 11:15 గంటల సమయంలో వాన్స్ బృందం ఫ్లైట్ దిగింది. పాక్‌కు బయల్దేరే ముందు వాన్స్ మాట్లాడుతూ.. శాంతి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ చర్చలు సానుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..
మినాబ్ మృతుల కోసం విమానంలో ఒక్కోసీటు.. రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు కూడా
యూజర్లకు షాకిచ్చిన యూట్యూబ్.. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెంపు..
50 కోట్ల బడ్జెట్ - 9 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



