Iran | మినాబ్ మృతుల కోసం విమానంలో ఒక్కోసీటు.. రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు కూడా
Iran | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ వేదికైంది. ఈ చర్చల కోసం అమెరికా ప్రతినిధుల బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకోగా.. ఇరాన్ (Iran) బృందం కూడా ప్రత్యేక ఫ్లైట్‌లో పాక్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్వేగభరిత సన్నివేశం చోటు చేసుకుంది.
International | Published On Apr 11, 2026, 11.25 am IST
Iran | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ వేదికైంది. ఈ చర్చల కోసం అమెరికా ప్రతినిధుల బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకోగా.. ఇరాన్ (Iran) బృందం కూడా ప్రత్యేక ఫ్లైట్‌లో పాక్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్వేగభరిత సన్నివేశం చోటు చేసుకుంది. ఇటీవలే అమెరికా దాడిలో ఇరాన్‌లోని మినాబ్ (Minab) నగరంలో గల ఓ పాఠశాల ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 160 మంది చిన్నారులు, 14 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్‌కు వెళ్లే ఇరాన్ ప్రతినిధుల విమానంలో మృతి చెందిన చిన్నారుల కోసం ఒక్కో సీటు కేటాయించారు.
ప్రతీ సీటులోనూ చిన్నారుల ఫొటోలను ఉంచి, వారి బూట్లు, రక్తంతో తడిసిన బ్యాగులు ఉంచారు. వాటివద్ద తెల్లటి పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ (Mohammad Bagher Ghalibaf) ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అంతేకాదు, చిన్నారుల మృతికి నివాళిగా ఆ విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. "విమాన ప్రయాణంలో నా సహచరులు.. మినాబ్ 168" అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28న దాడులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన తోమహాక్ క్షిపణి మినాబ్ పట్టణంలోని షజారే తయ్యిబే బాలికల ప్రాథమిక పాఠశాలను తాకింది. ఈ దాడిలో 160 మంది చిన్నారులు సహా మొత్తం 180 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ ఒకే దగ్గర సమాధి చేశారు. ఇందుకోసం ఓ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫొటోను ఇజ్రాయెల్ మంత్రి అబ్బాస్ గతనెల విడుదల చేసిన విషయం తెలిసిందే. పాఠశాలపై దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
These are graves being dug for more than 160 innocent young girls who were killed in the US-Israeli bombing of a primary school. Their bodies were torn to shreds.
This is how "rescue" promised by Mr. Trump looks in reality.
From Gaza to Minab, innocents murdered in cold blood. pic.twitter.com/cRdJ3BELOn
— Seyed Abbas Araghchi (@araghchi) March 2, 2026
Also Read..
50 కోట్ల బడ్జెట్ - 9 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ
యుద్దం ముగిసి హోర్ముజ్ తెరుచుకున్నా.. ఇంధన మార్కెట్లకు తిప్పలే..
ప్రయాణికులకు అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






