త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Excise Department | ‘ఉత్త‌మ అధికారిని దూషించిన క‌మిష‌న‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి’

Excise Department | అకార‌ణంగా నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ‌ (Excise Department) డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని ప‌రుష ప‌ద‌జాలంతో దూషించిన (Abusing) ఆ శాఖా క‌మిష‌న‌ర్ (Commissioner) పై వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు (Action) తీసుకోవాల‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి (Lachireddy), సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ ఓడనాల రాజ‌శేఖ‌ర్(Rajashekar) డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌నపై ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాలన్నారు.

S

News | Published On Apr 11, 2026, 11.55 am IST

Excise Department | ‘ఉత్త‌మ అధికారిని దూషించిన క‌మిష‌న‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి’
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: అకార‌ణంగా నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ‌ (Excise Department) డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని ప‌రుష ప‌ద‌జాలంతో దూషించిన (Abusing) ఆ శాఖా క‌మిష‌న‌ర్ (Commissioner) పై వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి (Lachireddy), సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ ఓడనాల రాజ‌శేఖ‌ర్(Rajashekar) డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌నపై ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాలన్నారు. ఈ మేర‌కు వారు శ‌నివారం మీడియాతో మాట్లాడారు. సోమిరెడ్డి చేయని తప్పుకు ‘వెధవ’, ‘ఇడియట్’ అంటూ క‌మిష‌న‌ర్ దూషించ‌డం ఆయ‌న అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 30 ఏళ్లుగా ఆబ్కారీ శాఖ‌కు సోమిరెడ్డి ఉత్త‌మ సేవ‌లందిస్తున్న‌ట్లు చెప్పారు.

ఉత్త‌మ అధికారిని అవ‌మానప‌ర్చిన క‌మిష‌న‌ర్‌ను వెంట‌నే స‌స్పెండ్ చేయాలన్నారు. ఉద్యోగుల‌ను దూషిస్తూ, అవ‌మాన‌ప‌రుస్తున్న క‌మిష‌న‌ర్ తీరుపై ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసి విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు. అన్ పార్ల‌మెంట‌రీ భాష‌తో, ప‌రుష ప‌ద‌జాలంతో ఉద్యోగుల‌ను దూషించ‌డం త‌గ‌ద‌న్నారు. ఉద్యోగుల‌ జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్న క‌మిష‌న‌ర్ వైఖ‌రిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు.

Advertisement
Advertisement