త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఉగ్ర‌వాదానికి భార‌త్ ఎన్న‌టికీ త‌ల‌వంచ‌దు.. ప‌హ‌ల్గామ్‌ మృతుల‌కు ప్ర‌ధాని నివాళి

PM Modi | ఉగ్ర‌వాదానికి భార‌త్ ఎన్న‌టికీ త‌ల‌వంచ‌దని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. జ‌మ్ము క‌శ్మీర్‌లోని మినీ స్విట్జ‌ర్లాండ్‌గా పేరొందిన ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌కు నేటికి ఏడాది పూర్తైన సంద‌ర్భంగా ఆ దాడిలో మ‌ర‌ణించిన వారికి నివాళుల‌ర్పించారు.

D

National | Published On Apr 22, 2026, 10.06 am IST

PM Modi | ఉగ్ర‌వాదానికి భార‌త్ ఎన్న‌టికీ త‌ల‌వంచ‌దు.. ప‌హ‌ల్గామ్‌ మృతుల‌కు ప్ర‌ధాని నివాళి
Advertisement

India Will Never Bow To Terror PM Modi Honours Victims A Year After Pahalgam Attack

PM Modi | జ‌మ్ము క‌శ్మీర్‌లోని మినీ స్విట్జ‌ర్లాండ్‌గా పేరొందిన ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌కు నేటికి ఏడాది పూర్తైంది. ఈ సంద‌ర్భంగా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) నివాళుల‌ర్పించారు. ఈ ఉగ్ర‌దాడి దేశం మొత్తాన్ని క‌లచివేసింద‌న్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

"గతేడాది ఇదే రోజున పహల్గామ్‌లో జ‌రిగిన‌ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల‌ను స్మ‌రించుకుంటున్నాను. విషాద ఘ‌ట‌న‌ను, అందులో మ‌ర‌ణించిన వారిని ఈ దేశం ఎన్నటికీ మరువదు. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయి బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దుఃఖంలోనూ దేశం మొత్తం ఐక్యంగా నిల‌బ‌డాలి. ఉగ్ర‌వాదానికి భార‌త్ ఎన్న‌టికీ త‌ల‌వంచ‌దు. ఉగ్ర‌వాదుల కుట్ర‌లు ఎప్ప‌టికీ ఫ‌లించ‌వు" అని ప్ర‌ధాని మోదీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Also Read..

హైద‌రాబాద్ నుంచి 8 కొత్త రైళ్లు.. వ‌చ్చే నెల నుంచి సేవ‌లు ప్రారంభం..

డిపోల నుంచి క‌ద‌ల‌ని బ‌స్సులు.. ప్రయాణికుల‌కు త‌ప్ప‌ని అవస్థలు

ఐసెట్‌ను మించి.. లాసెట్‌కు పెరుగుతున్న ద‌ర‌ఖాస్తులు

Advertisement
Advertisement