Pitbull Attack | 6 నెలల పసికందుపై పిట్‌బుల్ దాడి.. షాకింగ్ వీడియో
Pitbull Attack | ఆరు నెలల పసికందుపై పిట్‌బుల్ (Pitbull Attack) దాడి చేసింది. చిన్నారిని నోటికి కరిపించుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది.
Pitbull Attack | త్రినేత్ర.న్యూస్ : హర్యానా (Haryana) సోనిపట్ (Sonipat)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తల్లి చేతుల్లో ఉన్న ఆరు నెలల పసికందుపై కుక్క దాడి (Pitbull Attack) చేసింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సిక్కా కాలనీలో ఓ మహిళ తన ఆరు నెలల చిన్నారిని ఎత్తుకుని బయట నిల్చొని ఉంది. ఆ సమయంలో ఓ పిట్‌బుల్ అకస్మాత్తుగా దూసుకొచ్చి దాడి చేసింది. దీంతో తల్లీ, బిడ్డ ఇద్దరూ కింద పడిపోయారు. ఆ తర్వాత చిన్నారిపై కుక్క దారుణంగా దాడి చేసింది. చిన్నారిని నోటితో పట్టుకుని వదిలిపెట్టకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. స్థానికులు ఎంత ప్రయత్నించినా ఆ కుక్క చిన్నారిని విడిచిపెట్టలేదు. కుక్క దాడిలో పసికందు తీవ్రంగా గాయపడింది.
కుటుంబ సభ్యులు చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రోహ్తక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన జాతి కుక్కలను (పిట్‌బుల్, రోట్‌వైలర్) ఇళ్లలో పెంచుకునే విషయంలో యజమానుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో ఢిల్లీలోని వినయ్ ఎన్‌క్లేవ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగిన విషయం తెలిసిందే. అక్కడ పిట్‌బుల్ దాడిలో ఆరేళ్ల బాలుడు తన కుడి చెవిలో కొంత భాగం కోల్పోయాడు. ఆ ఘటనలో కుక్క యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో కూడా పిట్‌బుల్స్ దాడులు పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన అధికారులు స్థానికంగా కొన్ని ఆంక్షలు విధించారు. ఘజియాబాద్, చండీగఢ్‌లలో పిట్‌బుల్స్, రాట్‌వీలర్స్ వంటి ప్రమాదకరమైన జాతి కుక్కలను పెంచుకోవడంపై నిషేధం కూడా విధించారు.
Pitbull pet attacks 6 month old kid in Sonipat Haryana.
Check how relaxed is the Pitbull owner, sorry parent, while the dog was brutally attacking the kid.
Kid is severely injured, in hospital.
But Dog Lovers will still defend it. Justify it by saying dog must be hungry,… pic.twitter.com/K2LSXf8tUK
— Ankur Singh (@AnkurSingh) September 17, 2026
Also Read..
మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
తాజావార్తలు
- ●Danam Nagender | మంత్రి కూల్ కూల్ అంటున్నడు.. కాంగ్రెస్ సర్కార్‌పై దానం ఎదురుదాడి
- ●Delhi | మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
- ●KTR | ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
- ●Stock Markets | తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●CM Revanth Reddy | మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●Nizamabad | పొరపాటున పేలిన తుపాకీ.. ఇన్స్పెక్టర్ మృతి

Danam Nagender | మంత్రి కూల్ కూల్ అంటున్నడు.. కాంగ్రెస్ సర్కార్‌పై దానం ఎదురుదాడి

Delhi | మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

KTR | ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్

Stock Markets | తగ్గిన ముడి చమురు ధరలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..






