Aircraft Crashes | కాన్పూర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి
Aircraft Crashes | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో ఓ ప్రైవేట్ శిక్షణా విమానం కుప్పకూలిపోయింది (Aircraft Crashes). ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు.
Aircraft Crashes | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో ఘోర ప్రమాదం సంభవించింది. గంగా నది తీర సమీపంలో గురువారం మధ్యాహ్న సమయంలో ఓ ప్రైవేట్ శిక్షణా విమానం కుప్పకూలిపోయింది (Aircraft Crashes). ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కాన్పూర్‌కు చెందిన 'గార్గ్ ఏవియేషన్' (Garg Aviation)అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఫోర్‌సీటర్ విమానం గంగా బ్యారేజ్ ప్రాంతంలోని నత్థూపుర్వా వద్ద కూలిపోయింది. ప్రమాద సమయంలో అందులో పైలట్, కో-పైలట్ ఉన్నారు. వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం కుప్పకూలిన వెంటనే భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఘటనాస్థలి వద్దకు పరుగులు తీశారు. మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు చేపట్టింది.
Also Read..
ఒక్క మంచు ఫలకం సృష్టించిన విధ్వంసం
సంబంధిత వార్తలు

Special Trains | ఆగస్టులో కాచిగూడ-తిరుచానూరు మధ్య.. వరంగల్ మీదుగా కాన్పూర్-మధురై ప్రత్యేక రైళ్లు
జులై 30, 2026

BTech gold medallist | 50 సార్లు ఉద్యోగ ప్రయత్నం విఫలం.. సూసైడ్ చేసుకున్న గోల్డ్‌మెడలిస్ట్
జులై 20, 2026

Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
- ●Ramchandar Rao | విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే.. వారి గూంజ్ కాంగ్రెస్‌కు వినిపిస్తలేదు
- ●Nepal Floods | ఒక్క మంచు ఫలకం సృష్టించిన విధ్వంసం
- ●Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!
- ●Ethics Committee | కడియంపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు
- ●Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"

Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..

Ramchandar Rao | విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే.. వారి గూంజ్ కాంగ్రెస్‌కు వినిపిస్తలేదు

Nepal Floods | ఒక్క మంచు ఫలకం సృష్టించిన విధ్వంసం

Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!



