త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Americans | చెదిరిన డాల‌ర్ క‌ల‌.. అమెరికాను వీడేందుకు సిద్ధ‌మైన 40 శాతం మంది భార‌తీయులు

Indian Americans | చాలా మంది విదేశీయులు అగ్ర‌రాజ్యాన్ని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దాదాపు 40 శాతం మంది భార‌త సంత‌తి వ్య‌క్తులు (Indian Americans) శాశ్వ‌తంగా అమెరికాను వీడాల‌ని యోచిస్తున్న‌ట్లు ఓ స‌ర్వే ద్వారా వెల్ల‌డైంది.

D

International | Published On Apr 23, 2026, 1.02 pm IST

Indian Americans | చెదిరిన డాల‌ర్ క‌ల‌.. అమెరికాను వీడేందుకు సిద్ధ‌మైన 40 శాతం మంది భార‌తీయులు
Advertisement

Indian Americans | అమెరికా (America) వెళ్లాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ క‌ల‌లు కంటుంటారు. డాల‌ర్లు సంపాదించాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు. అయితే, వారి క‌ల చెదిరింది. అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. అమెరిక‌న్లే ఫ‌స్ట్ అన్న ట్రంప్ నినాదం వ‌ల‌స‌దారుల‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దీంతో చాలా మంది విదేశీయులు అగ్ర‌రాజ్యాన్ని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దాదాపు 40 శాతం మంది భార‌త సంత‌తి వ్య‌క్తులు (Indian Americans) శాశ్వ‌తంగా అమెరికాను వీడాల‌ని యోచిస్తున్న‌ట్లు ఓ స‌ర్వే ద్వారా వెల్ల‌డైంది.

చాలా మంది భార‌తీయుల‌కు ఒక‌ప్పుడు అమెరికా అనేది ఓ క‌ల‌క‌ల గ‌మ్య‌స్థానంగా ఉండేది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అమెరిక‌న్ డ్రీమ్ క‌నుమ‌రుగ‌వుతోంది. అంత‌ర్జాతీయ సంస్థ‌ కార్నెగీ ఎండోమెంట్ (Carnegie Endowment) నిర్వహించిన ఒక సర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది. భార‌తీయ అమెరిక‌న్ల‌లో ఆందోళ‌న‌లు పెరుగుతోంద‌ని.. చాలా మంది యూఎస్‌ను శాశ్వ‌తంగా వీడి వెళ్ల‌డం గురించి ఆలోచిస్తున్న‌ట్లు తేలింది. ప్ర‌తి 10 మంది ఇండియ‌న్ అమెరిక‌న్ల‌లో క‌నీసం న‌లుగురు ఇదేవిధంగా ఆలోచిస్తున్నార‌ట‌.

అదే కార‌ణం..

రాజ‌కీయ‌, ఆర్థిక‌, సామాజిక ఒత్తిళ్ల కార‌ణంగా దాదాపు 40% మంది భారతీయ అమెరికన్లు దేశం విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ఈ స‌ర్వేలో వెల్ల‌డైంది. ఇక రాజ‌కీయ అస్థిర‌త వ‌ల్లే తాము అమెరికాను వీడాల‌నుకుంటున్న‌ట్లు దాదాపు 58% మంది పేర్కొన్నారు. జీవ‌న వ్యయం వ‌ల్ల 54 శాతం మంది, వ్యక్తిగత భద్రత ప‌ట్ల ఆందోళ‌నలో 41% మంది యూఎస్‌ను వీడాల‌ని యోచిస్తున్నార‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది. ఇక 71 శాతం మంది ట్రంప్ పాల‌న ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కాగా, ప్ర‌స్తుతం అమెరికాలో దాదాపు 5.2 మిలియ‌న్ల మంది అంటే 52 ల‌క్ష‌ల మంది భార‌తీయులు నివ‌సిస్తున్నారు. ఇది ఆ దేశ మొత్తం జ‌నాభాలో 1.5 శాతానికి స‌మానం.

Also Read..

పెరుగుతున్న ఎండ తీవ్ర‌త‌.. ఈ జాగ్ర‌త్త‌లు మ‌స్ట్‌

బిగ్ అల‌ర్ట్‌.. భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్ప‌టి నుంచంటే..?

తెరుచుకున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు.. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

Advertisement
Advertisement