త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Ring Falls Into Train Toilet | ప్ర‌యాణికుడి చేతి నుంచి ట్రైన్ టాయిలెట్‌లోకి జారిపోయిన గోల్డ్ రింగ్‌.. త‌ర్వాత ఏమైందంటే..?

Gold Ring Falls Into Train Toilet | రైలు ప్ర‌యాణంలో ఓ ప్ర‌యాణికుడికి ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. త‌న చేతికి ఉన్న బంగారు ఉంగ‌రం పొర‌పాటున రైలు టాయిలెట్‌లోకి జారి ప‌డిపోయింది. అయితే, రైల్వే సిబ్బంది ఎంతో శ్ర‌మించి ఆ ఉంగ‌రాన్ని వెలికితీశారు. అనంత‌రం దాన్ని సుర‌క్షితంగా స‌ద‌రు ప్ర‌యాణికుడి చేతిలో పెట్టారు.

D

National | Published On May 16, 2026, 4.20 pm IST

Gold Ring Falls Into Train Toilet | ప్ర‌యాణికుడి చేతి నుంచి ట్రైన్ టాయిలెట్‌లోకి జారిపోయిన గోల్డ్ రింగ్‌.. త‌ర్వాత ఏమైందంటే..?
Advertisement

Gold Ring Falls Into Train Toilet | రైల్లో ఏదైనా చిన్న‌ వ‌స్తువు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొంద‌డం దాదాపు అసాధ్యం. అలాంటిది మన చేతికి ఉన్న ఖరీదైన బంగారు ఉంగ‌రం (Gold Ring) పొర‌పాటున ట్రైన్ టాయిలెట్‌ (Train Toilet)లో ప‌డిపోతే..? ఆ ఊహే చాలా భ‌యంక‌రంగా ఉంది క‌ద‌. అది దొర‌క‌డం చాలా క‌ష్టం. దానిపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. కానీ, ఓ ప్ర‌యాణికుడికి (Passenger) మాత్రం ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ ద‌క్కింది. ట్రైన్ టాయిలెట్‌లో పోగొట్టుకున్న ఉంగ‌రం.. తిరిగి అత‌డి వ‌ద్ద‌కే చేరింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

అహ్మదాబాద్ (Ahmedabad) డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) కార్యాలయం ఎక్స్ (X) వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. బాంద్రా టెర్మినస్-భుజ్ స్పెషల్ రైలు (Bandra Terminus-Bhuj Special train)లో ప్ర‌యాణిస్తున్న ఓ ప్ర‌యాణికుడు ట్రైన్ టాయిలెట్‌‌లో తన చేతికి ఉన్న ల‌క్ష‌లు విలువ చేసే బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. పొరపాటున అది ఆయన వేలి నుంచి జారి టాయిలెట్‌లో పడి చివరకు వ్యర్థాల ట్యాంకులోకి చేరింది. ఈ ఘ‌ట‌న‌తో స‌ద‌రు ప్ర‌యాణికుడు ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. ఇక‌ ఆ ఉంగ‌రం త‌న‌కు దొర‌క‌న‌ట్లే అని దానిపై ఆశ‌లు వ‌దులుకున్నాడు.

చివ‌రి ప్ర‌య‌త్నంగా ఈ విష‌యంపై రైల్వే అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. అత‌డి ఫిర్యాదుకు స్పందించిన వెస్ట్రన్ రైల్వే అధికారులు.. రైలు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే మిస్సైన‌ నగ కోసం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సిబ్బంది రైల్లోని పైపులు, వ్యర్థాల ట్యాంకును జ‌ల్లెడ ప‌ట్టారు. డ్రైనేజీ వ్యవస్థలో ఉన్న క‌ఠిన‌మైన‌ వాతావరణం, విపరీతమైన దుర్వాసనను కూడా లెక్కచేయలేదు. కొన్ని గంట‌ల‌పాటూ తీవ్రంగా శ్ర‌మించారు. చివ‌రికి వారి శ్ర‌మ‌కు ఫ‌లితం ద‌క్కింది. ఆ బంగారు ఉంగ‌రాన్ని విజ‌య‌వంతంగా వెలికితీయ‌గ‌లిగారు. అనంత‌రం దాన్ని సుర‌క్షితంగా ప్ర‌యాణికుడికి అప్ప‌గించారు.

త‌న‌కు ఇక దొర‌క‌ద‌నుకున్న బంగారు ఉంగ‌రం చివ‌రికి ద‌క్క‌డంతో ఆ ప్ర‌యాణికుడి ఆనందానికి అవ‌ధులు లేవు. ఎంతో శ్ర‌మించి త‌న న‌గ‌ను వెతికిపెట్టిన రైల్వే సిబ్బందికి అత‌డు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. రైల్వే సిబ్బంది నిజాయితీ, నిబ‌ద్ధ‌తకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌యాణికుల భ‌ద్ర‌తే కాదు, వారి సమస్యలను పరిష్కరించడంలోనూ ఎప్పుడూ ముందే ఉంటామ‌ని రైల్వే శాఖ నిరూపించుకుంది.

Also Read..

చదివిన వెంటనే మాయమయ్యే మెసేజ్‌లు.. వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్!

షికోపూర్ భూకుంభ‌కోణం కేసులో ఈడీకి ఎదురుదెబ్బ‌.. రాబ‌ర్ట్ వాద్రాకు బెయిల్‌..!

'బండి'ని బ‌ర్త‌ర‌ఫ్ చేయండి.. ప్ర‌ధాని మోదీకి క‌ల్వ‌కుంట్ల క‌విత లేఖ‌

Advertisement
Advertisement