Robert Vadra | షికోపూర్ భూకుంభకోణం కేసులో ఈడీకి ఎదురుదెబ్బ.. రాబర్ట్ వాద్రాకు బెయిల్..!
Robert Vadra | షికోపూర్ భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.
Robert Vadra | షికోపూర్ భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ జారీ చేసిన సమన్ల మేరకు కోర్టుకు హాజరైన వాద్రాకు ప్రత్యేక న్యాయమూర్తి సుశాంత్ చంగోత్రా బెయిల్ బాండ్లు సమర్పించాలని ఆదేశించారు. అదనంగా షరతులు ఏవీ విధించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది
విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బెయిల్ బాండ్ మాత్రమే దాఖలు చేయాలని చెబుతున్నానని, షరతులేవీ లేవని వ్యాఖ్యానించారు. అనంతరం రాబర్ట్ వాద్రా కోర్టు బయట మీడియాతో మాట్లాడారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈడీ పని చేస్తోందని తనకు తెలుసునని విమర్శించారు. తాను న్యాయవ్యవస్థను నమ్ముతున్నానని, తనకు దాచాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. అందుకే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తమ కుటుంబం ఎన్నికల్లో విజయాలు సాధిస్తోందని, ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్న ఆయన.. అందుకే ఇలాంటి కేసులను ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఉందని, తనకు భయమేమీ లేదన్నారు.
ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనలు ఇలా..
హర్యానాలోని షికోపూర్ లాండ్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రాబర్ట్ వాద్ర ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జస్టిస్ మనోజ్ జైన్ ధర్మాసనం ఎదుట ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాద్రా దాఖలు చేసిన పిటిషన్ తప్పుదారి పట్టించేలా ఉందని, కొట్టివేయాలని కోరారు. వాద్రా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన నేరాలు అప్పట్లో మనీలాండరింగ్ చట్టంలోని షెడ్యూల్డ్ ఆఫెన్సెస్ జాబితాలో లేవని, అందువల్ల ఈడీకి దర్యాప్తు చేసే అధికారం లేదన్నారు. భూవ్యవహారం 2008 నుంచి 2012 మధ్య జరిగిందని, ఈ కేసుకు సంబంధించిన నేరాలను మాత్రం 2013, 2018లోనే షెడ్యూల్‌లో చేర్చారని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు ఈడీ తోసిపుచ్చింది. ఈ కేసు విచారణను మే 18కి వాయిదా వేసిన కోర్టు.. ఈడీ వాదనలకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత వార్తలు

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



