T20 World cup | టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా బ్యాటింగ్ ఫస్ట్..
T20 World cup | టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ
T20 World cup | టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనున్నది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నది. న్యూజిలాండ్ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. స్పిన్నర్ కోల్ మెక్‌కాంచీ స్థానంలో జాకబ్ డఫీని జట్టులోకి తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేయడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.
జట్లు ఇవే..
టీమిండియా : సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ : టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.
టైటిల్ వేటలో..
మ్యాచ్ ప్రారంభానికి ముందు రికీ మార్టిన్, ఫల్గుణి పాఠక్, సుఖ్‌బీర్ ప్రదర్శనలు అలరించాయి. వరుసగా రెండోసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉన్నది. టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక జట్టు రెండుసార్లు వరుసగా టైటిల్ నెగ్గిన దాఖలాలు లేవు. అదే సమయంలో ఆతిథ్య జట్టు టైటిల్ విజేతగా నిలిచింది లేదు. దాంతో ఈ సారి ఎలాగైనా టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టు బరిలోకి దిగుతోంది. స్వదేశంలోనే భారత్‌ను ఓడించి రెండోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోవాలని న్యూజిలాండ్ కసితో ఉంది.
ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు టీ20 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ, మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్టేడియానికి చేరుకున్నారు. ఫైనల్ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షా ఇరుజట్లకు శుభాకాంక్షలు తెలిపారు. టీ20 వరల్డ్‌కప్ రికార్డు స్థాయిలో గుర్తింపు పొందిందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభ్య దేశాలకు ధన్యవాదాలు తెలిపారు.ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్ కప్ ఇప్పటికే చరిత్రను సృష్టించింది. ఈ సిరీస్‌ను అత్యధికంగా వీక్షించిన సిరీస్‌గా నిలిచింది. కేవలం భారత్‌లోనే 5కోట్ల మంది వీక్షించారు. ఇది ఏ టీ20 వరల్డ్ కప్‌లోనైనా అత్యధికం.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






