త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | ‘బండి’ని బ‌ర్త‌ర‌ఫ్ చేయండి.. ప్ర‌ధాని మోదీకి క‌ల్వ‌కుంట్ల క‌విత లేఖ‌

Kalvakuntla Kavitha | పోక్సో కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బండి భ‌గీర‌థ్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేగుతోంది. ఈ వ్య‌వ‌హారంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంది. తాజాగా టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా బండి భ‌గీర‌థ్ వ్య‌వ‌హారంపై స్పందించారు.

S

Telangana | Published On May 16, 2026, 4.00 pm IST

Kalvakuntla Kavitha | ‘బండి’ని బ‌ర్త‌ర‌ఫ్ చేయండి.. ప్ర‌ధాని మోదీకి క‌ల్వ‌కుంట్ల క‌విత లేఖ‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : పోక్సో కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బండి భ‌గీర‌థ్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేగుతోంది. ఈ వ్య‌వ‌హారంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంది. తాజాగా టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా బండి భ‌గీర‌థ్ వ్య‌వ‌హారంపై స్పందించారు. బండి సంజ‌య్ కుమారుడు భ‌గీర‌థ్‌పై న‌మోదైన పోక్సో కేసు విచార‌ణ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాలంటే ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని క‌విత డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి క‌విత లేఖ రాశారు.

లేఖ సారాంశం ఇదే..

ఈ కేసు అత్యంత తీవ్ర‌మైన‌ది. మైన‌ర్‌ను లైంగికంగా వేధించార‌ని ద‌ర్యాప్తులో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ద‌ర్యాప్తు స్వ‌తంత్రంగా, రాజ‌కీయ ఒత్తిళ్లు లేకుండా సాగాలి. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండటం వల్ల దర్యాప్తు అధికారులు, సాక్షులు, సాక్ష్యాల సేకరణపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కేసు దృష్ట్యా బండి సంజ‌య్ కేంద్ర మంత్రి ప‌ద‌విలో కొన‌సాగ‌డం స‌రికాదు. బండి మంత్రి పదవిలో కొనసాగడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

దేశంలో మైనర్ల రక్షణ కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కాదు. బాధితురాలికి పూర్తి న్యాయం జ‌ర‌గాలంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల నమ్మకం కాపాడాలంటే విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు.ఈ సందర్భంగా రాజ్యాంగ నిబద్ధత, నైతిక విలువలను కాపాడటం ప్రధాని మోదీ తక్షణ కర్తవ్యం. కేసు విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలి. ఇలా చేయడం ద్వారా దర్యాప్తు ఏ విధమైన ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా జరుగుతుంది అని క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు.

Advertisement
Advertisement