త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whatsapp | చదివిన వెంటనే మాయమయ్యే మెసేజ్‌లు.. వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్!

Whatsapp | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకు డిసప్పియరింగ్ మెసేజ్‌లు పంపిన సమయం నుంచి నిర్ణయించిన వ్యవధి పూర్తయ్యాక ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేవి. అయితే ఇప్పుడు చదివిన తర్వాత మెసేజ్‌లు తొలగిపోయే విధంగా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

S

Technology | Published On May 16, 2026, 4.03 pm IST

Whatsapp | చదివిన వెంటనే మాయమయ్యే మెసేజ్‌లు.. వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్!
Advertisement

Whatsapp | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకు డిసప్పియరింగ్ మెసేజ్‌లు పంపిన సమయం నుంచి నిర్ణయించిన వ్యవధి పూర్తయ్యాక ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేవి. అయితే ఇప్పుడు చదివిన తర్వాత మెసేజ్‌లు తొలగిపోయే విధంగా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ను ముందుగా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లలో గుర్తించగా, ప్రస్తుతం ఐఫోన్ బీటా యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తోంది. దీని ద్వారా మెసేజ్‌లు ఎంతసేపు కనిపించాలి అనే విషయంలో యూజర్లకు మరింత ఫ్లెక్సిబుల్ కంట్రోల్స్ లభిస్తాయి. అదే సమయంలో చదవని మెసేజ్‌లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి.

ఐఓఎస్ బీటా యూజ‌ర్ల‌కు అందుబాటులో..

వాట్సాప్ ఫీచ‌ర్ ట్రాక‌ర్ డబ్ల్యూఏ బీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్ట్ ఫ్లైట్ ద్వారా విడుదలైన వాట్సాప్ బీటా ఫర్ ఐఓఎస్ వెర్షన్ 26.19.10.72 ఉపయోగిస్తున్న కొంతమంది యూజర్లకు అందుబాటులో ఉన్న‌ట్లు తేలింది. అలాగే యాప్ స్టోర్‌లో ఉన్న కొంతమంది యూజర్లకూ ఈ ఆప్షన్ కనిపిస్తుంద‌ని పేర్కొంది. కొత్త సెట్టింగ్ After reading పేరుతో డిసప్పియరింగ్ మెసేజ్ సెక్షన్‌లో కనిపిస్తోంది. దీనివల్ల మెసేజ్ పంపిన వెంటనే టైమర్ ప్రారంభం కాకుండా, రిసీవర్ మెసేజ్ చదివిన తర్వాత మాత్రమే కౌంట్‌డౌన్ మొదలవుతుంది. ఈ ఫీచర్‌లో యూజర్లు మూడు టైమ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. మెసేజ్ చదివిన తర్వాత 5 నిమిషాలు, 1 గంట లేదా 12 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ రిసీవర్ మెసేజ్‌ను ఓపెన్ చేయకపోతే, వాట్సాప్ 24 గంటల తర్వాత ఆ మెసేజ్‌ను స్వయంగా తొలగిస్తుంది.

పూర్తిగా ఆప్ష‌న‌ల్ మాత్ర‌మే..

ఇప్పటికే వాట్సాప్‌లో ఉన్న డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్‌లో 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల టైమర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వ్యక్తిగత చాట్స్‌కే కాకుండా అన్ని కొత్త కన్వర్సేషన్లకు డిఫాల్ట్‌గా కూడా యాక్టివేట్ చేయవచ్చు. అయితే కొత్త After reading టైమర్ పూర్తిగా ఆప్షనల్ ఫీచర్ అని సమాచారం. యూజర్లు స్వయంగా ఎనేబుల్ చేసినప్పుడే ఇది పనిచేస్తుంది. ఇప్పటికే ఉన్న చాట్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే పంపిన వ్యక్తి ఫోన్‌లోని మెసేజ్ కాపీ ఎంపిక చేసిన టైమర్ ప్రకారం డిలీట్ అవుతుంది. కానీ రిసీవర్ వైపు కౌంట్‌డౌన్ మాత్రం మెసేజ్ చదివిన తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ ఫీచర్‌ను ఎప్పుడు అన్ని యూజర్లకు విడుదల చేస్తారన్న విషయంపై వాట్సాప్ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రాబోయే వారాల్లో మరింత మంది బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement