త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | వినాయ‌క చ‌వితి ర‌ద్దీ.. ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

Special Trains | వినాయ‌క చతుర్థి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌–వత్వా మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

P

Telangana | Published On Sep 16, 2026, 1.22 pm IST

Special Trains | వినాయ‌క చ‌వితి ర‌ద్దీ.. ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే
Advertisement

Special Trains | వినాయ‌క చతుర్థి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌–వత్వా మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 07087 నంబర్ గ‌ల రైలు సెప్టెంబర్‌ 19న (శనివారం) రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, మరుసటి రోజు (ఆదివారం) రాత్రి 9.50 గంటలకు వ‌త్వా చేరుకుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో 07088 నంబర్‌ రైలు సెప్టెంబర్‌ 21న (సోమవారం) తెల్లవారుజామున 3.30 గంటలకు వ‌త్వా నుంచి బయలుదేరుతుంది. మంగళవారం ఉదయం 4.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు ఆయా మార్గాల్లో బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కలబురగి, సోలాపూర్, దౌండ్, పుణె, కల్యాణ్, వసాయి రోడ్, వల్సాద్, సూరత్, వడోదర స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది.

Advertisement
Advertisement