NoiseFit Diva Araya | మహిళల కోసం ప్రత్యేకంగా సెరామిక్ స్మార్ట్ వాచ్.. లాంచ్ చేసిన నాయిస్..
NoiseFit Diva Araya | స్మార్ట్ వాచ్ లు, యాక్ససరీస్ తయారీ సంస్థ నాయిస్ తన నూతన స్మార్ట్ వాచ్ నాయిస్ ఫిట్ దివా అరయను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రీమియం ఫ్యాషన్-టెక్ విభాగంలో రిలీజ్ అయిన ఈ వాచ్‌ను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రవేశపెట్టారు. ఆభరణాలు అంటే ఇష్టపడే మహిళల కోసం జ్యువెల్లరీ డిజైన్ తరహాలో ఈ వాచ్‌ను రూపొందించారు.
Technology | Published On Apr 22, 2026, 10.31 am IST
NoiseFit Diva Araya | స్మార్ట్ వాచ్ లు, యాక్ససరీస్ తయారీ సంస్థ నాయిస్ తన నూతన స్మార్ట్ వాచ్ నాయిస్ ఫిట్ దివా అరయను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రీమియం ఫ్యాషన్-టెక్ విభాగంలో రిలీజ్ అయిన ఈ వాచ్‌ను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రవేశపెట్టారు. ఆభరణాలు అంటే ఇష్టపడే మహిళల కోసం జ్యువెల్లరీ డిజైన్ తరహాలో ఈ వాచ్‌ను రూపొందించారు. దీని వల్ల ఓ వైపు టెక్ ఫీచర్లను వాడుకుంటూనే మరోవైపు ఆభరణం లాంటి ఫీల్ పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ వాచ్‌ను సెరామిక్‌తో తయారు చేయగా, ఈ బ్రాండ్ నుంచి వచ్చిన తొలి సెరామిక్ స్మార్ట్ వాచ్ ఇదే కావడం విశేషం.
60 స్టోన్లతో ప్రత్యేక లుక్..
ఈ స్మార్ట్ వాచ్ సెరామిక్ బాడీనికి కలిగి ఉంటుంది. అందువల్ల స్క్రాచ్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. అంత సులభంగా స్క్రాచ్‌లు పడవు. సెరామిక్ బాడీ ఉన్నందున వాచ్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఈ వాచ్‌కు ప్రత్యేకంగా 60 స్టోన్లను అమర్చారు. దీని వల్ల వాచ్ డయల్ అద్భుతమైన లుక్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 3 రకాల స్ట్రాప్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. సెరామిక్‌తోపాటు మెటల్, మెష్ తరహా స్ట్రాప్‌లను ఇస్తున్నారు. ఇందులో 1.28 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 850 నిట్స్ బ్రైట్ నెస్‌ను కలిగి ఉంది. ఔట్‌డోర్‌లోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. 100కు పైగా వాచ్ ఫేస్‌లను ఇచ్చారు. వాటిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్‌ను ఇచ్చారు. దీని వల్ల ఫోన్‌కు కనెక్ట్ అయి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
ధర ఎంతంటే..?
ఈ వాచ్‌లో పలు ఆకర్షణీయమైన హెల్త్ అండ్ వెల్‌నెస్ ఫీచర్లను ప్రత్యేకంగా మహిళల కోసం అందించారు. చర్మం ఉష్ణోగ్రతను కొలిచే ఓవర్‌నైట్ స్కిన్ టెంపరేచర్ ట్రాకింగ్, శరీర ప్యాటర్న్‌లకు అనుగుణంగా రుతు క్రమాన్ని ట్రాక్ చేసే ఫీచర్, అత్యవసర సమయాల్లో ఎస్‌వోఎస్ అలర్ట్ సదుపాయం, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‌పీవో2 సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఇందులో ఇచ్చారు. ఈ వాచ్‌ను ఫుల్ చార్జింగ్ చేస్తే 5 రోజుల పాటు వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక నాయిస్ ఫిట్ దివా అరయ స్మార్ట్ వాచ్‌ను లాంచింగ్ సందర్భంగా రూ.4,999కు ఇస్తున్నారు. దీన్ని గో నాయిస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aadhaar | ఇక ఆధార్‌లో ఈ-మెయిల్ అప్డేట్ ఇంటి నుంచే.. యూఐడీఏఐ కొత్త సౌకర్యం..
జులై 3, 2026

Lithium Ion Battery Apps | లిథియమ్-అయాన్ బ్యాటరీ యాప్‌ల దుర్వినియోగం.. చైనా యాప్‌లను నిషేధించిన కేంద్రం..
జులై 3, 2026

WhatsApp | తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్‌కు చెక్.. ఈ సింపుల్ సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు..
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం

TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్



