Terrorists | ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 23 మందిని టెర్రరిస్టులుగా ప్రకటించిన కేంద్రం
Terrorists | పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న (Pakistan-based terror outfits) జైషే మహ్మద్, లష్కరే తోయిబా సహా ఇతర టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న 23 మందిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Terrorists | ఉగ్రవాదుల (terrorists) విషయంలో కేంద్ర హోం శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న (Pakistan-based terror outfits) జైషే మహ్మద్, లష్కరే తోయిబా సహా ఇతర టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ (UAPA) కింద వారిని ఉగ్రవాదులుగా పరిగణించినట్లు కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs) తన ప్రకటనలో తెలిపింది.
యూఏపీఏ చట్టం ప్రకారం.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ 23 మంది జమ్ము కశ్మీర్‌లో దాడులకు పాల్పడటం, చొరబాట్లు, యువతను తీవ్రవాదం వైపు మళ్లించడం, డ్రోన్లతో ఆయుధాలు సరఫరా చేయడం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు వారిని ఉగ్రవాదులుగా ప్రకటించింది.
2016లో ఏడుగురు సైనికులు అమరులైన నగ్రోటా సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి, 2022లో జమ్మూలోని సుంజ్‌వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలపై జరిగిన దాడులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మసూద్ ఇలియాస్ కశ్మీరీ, మహమ్మద్ ముసాదిక్, ముఫ్తీ మహమ్మద్ అస్గర్ ఖాన్, హాఫిజ్ అబ్దుల్ షకూర్ తదితరుల పేర్లు ఉన్నాయి. అలాగే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న అబ్దుల్ రౌఫ్, హాఫిజ్ ఖాలిద్ వలీద్ పేర్లను కూడా జాబితాలో చేర్చారు. వీరితో పాటు.. ఉగ్రవాద కుట్రల్లో పాల్గొనడం, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించడం, లాజిస్టిక్ మద్దతు, దాడులను అమలు చేయడంలో సహాయపడినందుకు గాను బిలాల్ అహ్మద్ మీర్, అబిద్ ఖయ్యూమ్ లోన్, నజీర్ అహ్మద్ గుజ్జర్, అష్ఫాక్ అహ్మద్, ఒవైస్ ఫరూజ్ తదితరులను ప్రభుత్వం ఈ జాబితాలో చేర్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్‌లో ట్యాబ్లెట్ యూజర్లకు భారీ అప్డేట్.. ఇక ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో కొత్త సౌకర్యాలు..
- ●Gold Monetisation Scheme | ఇకపై బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందొచ్చు.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టనున్న కేంద్రం..?
- ●Telegram | పైరసీ కంటెంట్.. టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
- ●Gadari Kishore | రేవంత్ నడిపేది సర్కారా.. సర్కసా?.. మాకైతే అర్థమైతలే
- ●Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాలనలో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ : జైరాం రమేష్
- ●IBPS SO Recruitment | ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు

WhatsApp | వాట్సాప్‌లో ట్యాబ్లెట్ యూజర్లకు భారీ అప్డేట్.. ఇక ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో కొత్త సౌకర్యాలు..

Gold Monetisation Scheme | ఇకపై బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందొచ్చు.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టనున్న కేంద్రం..?

Telegram | పైరసీ కంటెంట్.. టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

Gadari Kishore | రేవంత్ నడిపేది సర్కారా.. సర్కసా?.. మాకైతే అర్థమైతలే






