త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russian Aircraft | మొద‌టిసారి ఆ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయిన ర‌ష్య‌న్ సైనిక విమానాలు..

Russian Aircraft | 18వ బ్రిక్స్ (BRICS) స‌మావేశాల‌కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈనెల 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భార‌త్ మండ‌టం దీనికి వేదిక కానుంది. రెండు రోజుల‌పాటు జ‌రుగ‌నున్న‌ స‌మావేశాల‌కు బ్రిక్స్‌ దేశాల అధినేత‌లు హాజ‌రుకానున్నారు.

G

National | Published On Sep 10, 2026, 7.03 am IST

Russian Aircraft | మొద‌టిసారి ఆ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయిన ర‌ష్య‌న్ సైనిక విమానాలు..
Advertisement

Russian Aircraft | త్రినేత్ర‌.న్యూస్‌: 18వ బ్రిక్స్ (BRICS) స‌మావేశాల‌కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈనెల 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భార‌త్ మండ‌టం దీనికి వేదిక కానుంది. రెండు రోజుల‌పాటు జ‌రుగ‌నున్న‌ స‌మావేశాల‌కు బ్రిక్స్‌ దేశాల అధినేత‌లు హాజ‌రుకానున్నారు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రప్ర‌దేశ్‌లోని నోయిడా విమానాశ్ర‌యంలో (Noida Airport) ర‌ష్య‌న్ సైనిక విమానాలు (Russian Aircraft) ల్యాండ్ అయ్యాయి. దీంతో కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చిన ఈ విమానాశ్ర‌యంలో ఒక‌ విదేశీ విమానం దిగ‌డం ఇదే మొద‌టిసారి.

ఉదయం సుమారు 5.30 గంటల స‌మ‌యంలో రష్యాకు చెందిన 'IL-76' సైనిక రవాణా విమానంతో (Military Transport Aircraft) పాటు మిగిలిన విమానాలు రన్‌వేపై దిగాయి. వాటిలో ఆ దేశ అడ్వాన్స్ టీమ్, సైనిక అధికారులు వ‌చ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప‌ర్య‌ట నేప‌థ్యంలో ఈ విమానాలు వచ్చినట్లు తెలుస్తున్న‌ది. అయితే సాధారణంగా భారతదేశానికి వచ్చే విదేశీ సైనిక విమానాలు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తుంటాయి. అయితే, ఈసారి రష్యన్ విమానాలు నోయిడా విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడం ఈ కొత్త ఫెసిలిటీకి ఒక మైలురాయిగా నిలిచింది.

బ్రిక్స్ సదస్సు..

18వ బ్రిక్స్ సదస్సు (BRICS Summit) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో (Bharat Mandapam) సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనుంది. ఈ సదస్సుకు పలు దేశాల ప్రభుత్వాధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. అంతర్జాతీయ ప్రోటోకాల్, విదేశీ ప్రముఖుల రాకపోకల ఏర్పాట్లలో భాగంగానే ఈ రష్యన్ సైనిక విమానాలు నోయిడా విమానాశ్రయానికి చేరుకున్నాయి.

Advertisement
Advertisement