త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె

Power problem in Konda Reddy Pally | అది సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సీఎం పుట్టిన ఊరు. చిటికేసినంత ఈజీగా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. క‌నురెప్ప మూసి తెరిచినంత సేప‌ట్ల స‌మ‌స్యలు తీర్చొచ్చు. అలాంటిది ఆయ‌న సొంతూరిలోనే క‌రెంటు లేక రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వ‌చ్చింది.

S

Telangana | Published On Sep 10, 2026, 12.42 pm IST

Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె
Advertisement
  • విద్యుత్ కోత‌ల‌కు నిర‌స‌న‌గా రోడ్డెక్కిన రైతన్న‌లు
  • జాతీయ ర‌హ‌దారిపై భారీగా నిలిచిపోయిన వాహ‌నాలు

Power problem in Konda Reddy Pally | త్రినేత్ర‌.న్యూస్‌: అది సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సీఎం పుట్టిన ఊరు. చిటికేసినంత ఈజీగా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. క‌నురెప్ప మూసి తెరిచినంత సేప‌ట్ల స‌మ‌స్యలు తీర్చొచ్చు. అలాంటిది ఆయ‌న సొంతూరిలోనే క‌రెంటు లేక రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వ‌చ్చింది. విద్యుత్ లేక అన్న‌దాత‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న‌దానికి ఈ ధ‌ర్నే అద్దం ప‌డుతోంది.

నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల మెరుపు ధర్నాకు మంగ‌ళ‌వారం దిగారు. కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని పాటలు పడుతూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ‘ఓటేసిన పాపానికి మ‌దానో నామ‌యారి.. పంట‌ల‌న్నీ ఎండిపాయే మ‌దానోనామ‌యారి.. మాయ‌దారి కాంగ్రెస్ మ‌దానోనామ‌యారి’.. అంటూ పాట‌ల‌తో హోరెత్తించారు. పంటలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. ఈ రాస్తారోకోతో ర‌హదారిపై వాహ‌నాలు భారీగా నిలిచిపోయాయి.

Advertisement
Advertisement