త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Middle East Crisis | ఇరాన్ వార్‌.. 4,335 విమానాలు ర‌ద్దు : కేంద్ర ప్ర‌భుత్వం

Middle East Crisis | ఇరాన్‌-అమెరికా యుద్ధంతో ప‌శ్చిమాసియా ర‌ణ‌రంగంగా (Middle East Crisis) మారింది. గ‌త 16 రోజులుగా దాడులు, ప్ర‌తిదాడుల‌తో మ‌ధ్య‌ప్రాచ్యం ర‌గిలిపోతోంది. యుద్ధం కార‌ణంగా విమాన రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

D

National | Published On Mar 16, 2026, 3.54 pm IST

Middle East Crisis | ఇరాన్ వార్‌.. 4,335 విమానాలు ర‌ద్దు : కేంద్ర ప్ర‌భుత్వం
Advertisement

Middle East Crisis | ఇరాన్‌-అమెరికా యుద్ధంతో ప‌శ్చిమాసియా ర‌ణ‌రంగంగా (Middle East Crisis) మారింది. గ‌త 16 రోజులుగా దాడులు, ప్ర‌తిదాడుల‌తో మ‌ధ్య‌ప్రాచ్యం ర‌గిలిపోతోంది. యుద్ధం కార‌ణంగా విమాన రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఇక ఈ యుద్ధం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కూ వేలాది విమానాలు ర‌ద్దైన‌ట్లు ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు (K Rammohan Naidu) రాజ్య‌స‌భ‌ (Rajya Sabha)కు వెల్ల‌డించారు.

యుద్ధం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ దాదాపు 4,335 వినామాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు (4,300 Flights Cancelled) తెలిపారు. అదే స‌మ‌యంలో విదేశీ సంస్థ‌లు 1,187 విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి స‌మాధాన‌మిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్ మ‌ధ్య పెరుగుతున్న యుద్ధ వాతావ‌ర‌ణం కార‌ణంగా గ‌గ‌న‌త‌లాన్ని మూసివేయ‌డంతో విమాన‌యాన సంస్థ‌లు విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌యాణికుల భద్ర‌తే త‌మ తొలి ప్రాధాన్య‌త అని స్ప‌ష్టం చేశారు. సంక్షోభ స‌మ‌యంలో గ‌గ‌న‌త‌లం మూసివేసిన‌ప్పుడు ఆ ప్రాంతాల్లో విమానాల‌ను న‌డ‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంతేకాదు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ‌, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిరంత‌రం ఆయా దేశాలతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

అదేవిధంగా గ‌గ‌న‌త‌లం అందుబాటులో ఉన్న దేశాల‌కు విమానాల‌ను న‌డుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక‌ ఈ సంక్షోభ స‌మ‌యంలోనూ సుమారు 2,19,780 మంది ప్ర‌యాణించిన‌ట్లు స‌భ‌కు తెలిపారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇంకా గగనతలం మూసివేసే ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రయాణం సురక్షితమ‌ని నిర్ధరించుకున్న తర్వాతే సాధారణ సర్వీసులను పునరుద్ధరిస్తామని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు స‌భ‌కు వివరించారు.

Also Read..

న్యూయార్క్‌-ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం.. షాన‌న్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్ల‌యిట్ సేఫ్ ల్యాండింగ్‌..!

ర‌ణ‌రంగంగా ప‌శ్చిమాసియా.. వెన‌క్కి తిరిగొచ్చిన విమానాలు

రిలీజ్ ముంగిట స‌ల్మాన్ ఖాన్ మూవీ టైటిల్ ఛేంజ్ - చైనా ఆరోప‌ణ‌లు కార‌ణ‌మా?

Advertisement
Advertisement