Air India | న్యూయార్క్-ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం.. షానన్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ సేఫ్ ల్యాండింగ్..!
Air India | న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ350 విమానాన్ని ఐర్లాండ్‌లోని షానన్ విమాశ్రయానికి మళ్లించారు. అనుమానాస్పద సాంకేతిక లోపం కారణంతో ముందుజాగ్రత్త చర్యగా పైలట్లు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులున్నారు.
Air India | న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ350 విమానాన్ని ఐర్లాండ్‌లోని షానన్ విమాశ్రయానికి మళ్లించారు. అనుమానాస్పద సాంకేతిక లోపం కారణంతో ముందుజాగ్రత్త చర్యగా పైలట్లు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులున్నారు. మార్చి 15న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా 102 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఐర్లాండ్‌లోని షానన్ ఎయిర్‌పోర్టుకు మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.30 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉననట్లు కంపెనీ తెలిపింది. భద్రతా ప్రమాణాల మేరకు విమానాన్ని సాంకేతిక బృందం తనిఖీ చేస్తోందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని, ముందు జాగ్రత్తగా విమానాన్ని మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫ్లయిట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. దాదాపు విమానం ఆరుగంటల పాటు గాల్లోనే చక్కలు కొట్టింది. ఆ తర్వాత షానన్‌కు మళ్లించినట్లు ప్రతినిధి వివరించారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






