త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Salman Khan | రిలీజ్ ముంగిట స‌ల్మాన్ ఖాన్ మూవీ టైటిల్ ఛేంజ్ – చైనా ఆరోప‌ణ‌లు కార‌ణ‌మా?

స‌ల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ మూవీ టైటిల్ రిలీజ్ ముంగిట ఛేంజ్ అయ్యింది. ఈ సినిమా టైటిల్‌ను మాతృభూమిగా మార్చిన‌ట్లు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌క‌టించాడు.

N

Entertainment | Published On Mar 16, 2026, 3.52 pm IST

Salman Khan | రిలీజ్ ముంగిట స‌ల్మాన్ ఖాన్ మూవీ టైటిల్ ఛేంజ్ – చైనా ఆరోప‌ణ‌లు కార‌ణ‌మా?
Advertisement

Salman Khan |  రిలీజ్ ముంగిట సినిమాల పేర్లు మార‌డం ఇటీవ‌ల కామ‌న్‌గా మారిపోయింది. సెన్సార్ స‌మ‌స్య‌లు, వివాదాల కార‌ణంగా సినిమాల టైటిల్స్ మారిపోతున్నాయి. తాజాగా టైటిల్ ఛేంజ్ లిస్ట్‌లో స‌ల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ కూడా చేరింది. వార్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా టైటిల్‌ను మాతృభూమిగా ఛేంజ్ చేసిన‌ట్లు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

ఆర్మీ డ్రెస్‌లో...

ఈ పోస్ట‌ర్‌లో యాక్ష‌న్ లుక్‌లో స‌ల్మాన్ ఖాన్ క‌నిపిస్తున్నారు. ఆర్మీ డ్రెస్‌లో శ‌త్రువు దాడిని ఎదుర్కొంటూ ఇంటెన్స్‌గా స‌ల్మాన్ లుక్ సాగింది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
చైనా ఆరోప‌ణ‌లు...
కాగా ఈ టైటిల్ ఛేంజ్‌కు సెన్సార్ స‌మ‌స్య‌లు కార‌ణం కాద‌ట‌. చైనా చేసిన ఆరోప‌ణ‌ల వ‌ల్లే ఈ సినిమా టైటిల్‌ను మార్చాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు.2020లో భార‌త్ - చైనా మ‌ధ్య జ‌రిగిన గాల్వ‌న్ దాడుల నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ పోరాటంలో చైనా సైన్యాన్ని ఎదురించి భార‌త సైనికులు సాగించిన స్ఫూర్తిదాయక పోరాటం ఆధారంగా ద‌ర్శ‌కుడు అపూర్వ ల‌ఖియా ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు.

చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌...

ఇటీవ‌ల రిలీజైన ఈ టీజ‌ర్‌పై చైనా మీడియా నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌డ‌మే కాకుండా యాంటీ చైనా ల‌క్ష్యంతోనే స‌ల్మాన్‌ఖాన్ ఈ సినిమా చేస్తోన్నాడంటూ చైనా ప్ర‌భుత్వ అధికారిక ప్ర‌తిక గ్లోబ‌ల్ టైమ్స్ కూడా పేర్కొన్న‌ది. గాల్వ‌న్‌లో జ‌రిగింది వేర‌ని, క‌ల్పితాల‌ను ఈ సినిమా ద్వారా వాస్త‌వాలుగా న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌దంటూ ఆరోపించింది. ఈ ఆరోప‌ణ‌ల వ‌ల్లే సినిమా టైటిల్‌ను మేక‌ర్స్ ఛేంజ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీజ‌ర్‌పై విమ‌ర్శ‌లు...

గ‌త ఏడాది రిలీజైన బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ టీజ‌ర్‌ను చాలా మంది ట్రోల్ చేశారు. టీజ‌ర్‌లోని యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, స‌ల్మాన్ ఖాన్ క్యారెక్ట‌రైజేష‌న్ విష‌యంలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎమోష‌న్స్‌, దేశ‌భ‌క్తి లేకుండా సినిమా చాలా ఆర్టిఫిషియ‌ల్‌గా ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెట్టారు. ఈ విమ‌ర్శ‌ల‌పై స‌ల్మాన్ ఖాన్ కూడా రియాక్ట్ అయ్యారు. తాను ఆర్మీ ఆఫీస‌ర్ కాబ‌ట్టి సెటిల్డ్‌గానే క‌నిపించాలంటూ స‌మాధాన‌మిచ్చారు.
తెలుగు సైనికుడు...
గాల్వాన్ దాడుల్లో క‌న్నుమూసిన తెలుగు సైనికుడు క‌ల్న‌ల్ సంతోష్ బాబు జీవితం ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. చిత్రంగాద సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ టైటిల్ ఛేంజ్ కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదాప‌డిన‌ట్లు స‌మాచారం. ఆగ‌స్ట్ 14కు పోస్ట్‌పోన్ అయిన‌ట్లు చెబుతున్నారు.

Advertisement
Advertisement