త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain | భారీ వ‌ర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆల‌స్యం

Heavy Rain | దేశ రాజ‌ధాని ఢిల్లీని భారీ వ‌ర్షం (Heavy Rain) ముంచెత్తింది. ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో కుండ‌పోత వ‌ర్షం కురిసింది. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ఈ వ‌ర్షానికి రాజ‌ధానిలో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. విమాన రాక‌పోక‌ల‌ (Flight Operations)పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది.

D

National | Published On Aug 24, 2026, 3.15 pm IST

Heavy Rain | భారీ వ‌ర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆల‌స్యం
Advertisement

Heavy Rain | త్రినేత్ర‌.న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)ని భారీ వ‌ర్షం (Heavy Rain) ముంచెత్తింది. నోయిడా, ఘ‌జియాబాద్‌, గురుగ్రామ్‌, ఫ‌రీదాబాద్ స‌హా ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో కుండ‌పోత వ‌ర్షం కురిసింది. రోడ్లు పూర్తిగా జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. దీంతో ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ఈ వ‌ర్షానికి రాజ‌ధానిలో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది.

ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా ఫ్లైట్ ఆప‌రేష‌న్స్‌కు (Flight Operations) అంత‌రాయం ఏర్ప‌డింది. వ‌ర్షం, లోవిజిబిలిటీ కార‌ణంగా ఢిల్లీకి రాక‌పోక‌లు సాగించే 250కిపైగా విమానాలు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. ప‌లు విమానాల‌ను అధికారులు జైపూర్, ఛండీగ‌ఢ్‌, ల‌ఖ్‌న‌వూకు దారి మ‌ళ్లించారు. ఫ్లైట్ రాడార్ 24 ప్ర‌కారం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్ర‌స్తుతం స‌గ‌టున ఒక్కో విమానం 30 నిమిషాలు ఆల‌స్యంగా న‌డుస్తోంది. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా దాదాపు 262 విమానాలు ప్ర‌భావిత‌మ‌య్యాయి.

ఐఎండీ హెచ్చ‌రిక‌లు..

మ‌రోవైపు రానున్న రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD)  హెచ్చ‌రించింది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన‌ వ‌ర్షం కురుస్తుంద‌ని తెలిపింది. ఈ మేర‌కు ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. జ‌మ్ము క‌శ్మీర్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

Also Read..

ఇస్రోను కేంద్రం బ‌ల‌హీన‌ప‌రుస్తోంది.. జైరామ్ ర‌మేష్

సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మ‌హువా.. అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు నో..!

పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్: ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ABVP పిలుపు

Advertisement
Advertisement