Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్
Jairam Ramesh | అంతరిక్ష రంగంలో మోదీ (PM Modi) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానం వల్ల భారత అంతరిక్ష పరిశక్షధన సంస్థ ఇస్రో (ISRO) పాత్ర బలహీనపడుతుందని కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఆందోళన వ్యక్తం చేశారు.
Jairam Ramesh | త్రినేత్ర.న్యూస్ : అంతరిక్ష రంగంలో మోదీ (PM Modi) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానం వల్ల ఇస్రో (ISRO) పాత్ర బలహీనపడుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ( Jairam Ramesh) ఆందోళన వ్యక్తం చేశారు. అణు ఇంధన రంగం మాదిరిగానే అంతరిక్ష రంగంలోనూ ప్రభుత్వం దూకుడుగా ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు. ప్రైవేట్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ.. భారత అంతరిక్ష పరిశక్షధన సంస్థ పాత్రను తగ్గించడం వెనుక ఉన్న తార్కికం ఏంటని ప్రశ్నించారు.
ఇస్రో భవిష్యత్ పాత్రకు సంబంధించి ఇటీవలే వెలువడిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, బ్రహ్మ ప్రకాష్, యూఆర్ రావు, ఏపీజే అబ్దుల్ కలాం వంటి ఎంతోమంది ప్రముఖ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల దార్శనికత, అంకితభావం, నాయకత్వం కారణంగా గత ఆరు దశాబ్దాలుగా సంస్థ నిర్మించుకున్న సామర్థ్యాలు, మౌలిక వసతులను ప్రైవేట్ రంగానికి అప్పగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు (Indian space sector).
అణుశక్తి రంగంలో మాదిరిగానే, అంతరిక్ష కార్యక్రమాల్లో కూడా ప్రైవేటీకరణను వేగవంతం చేయాలనే బలమైన విధానం మోదీ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా జైరామ్ రమేష్ విమర్శించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధానమంత్రి, పీఎంవో కార్యాలయం చొరవ స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. రాకెట్ల తయారీ, అభివృద్ధిలో ఇస్రో (ISRO) పాత్రను గణనీయంగా తగ్గించి, ఉపగ్రహాలకు సంబంధించిన దాని ఆస్తుల్లో అధిక భాగాన్ని ప్రైవేట్ సంస్థలకు పూర్తిగా బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. తమిళనాడులో సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న రెండవ అంతరిక్ష కేంద్రాన్ని (spaceport) కూడా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించబోతున్నారని చెప్పారు. మారుతున్న పరిస్థితులను చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రాత్మక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ISRO భారతదేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిందని జైరామ్ రమేష్ చెప్పుకొచ్చారు. ఇస్రో సాధించిన విజయాల పట్ల ప్రధానమంత్రి స్వయంగా అనేక సందర్భాల్లో హర్షం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అంతరిక్ష రంగ స్టార్టప్‌లు ఖచ్చితంగా ప్రోత్సాహానికి, మద్దతుకు అర్హమైనవేనని చెప్పారు. కానీ, ప్రైవేట్ రంగంతో ఎప్పటి నుంచో ఫలప్రదమైన భాగస్వామ్యాలను కొనసాగిస్తున్న ISROను ఇప్పుడు ఎందుకు నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు..? అంటూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందే ఊహించినట్లుగా.. గత కొద్ది నెలల్లోనే ISROకు చెందిన 100-120 మంది కీలక నిపుణులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని చెప్పారు. ప్రధానమంత్రి స్ఫూర్తితో అక్టోబర్ 2018లో బీజేపీలో చేరిన ISRO మాజీ చైర్మన్ ఒకరు, ISROలో ప్రైవేటీకరణను ప్రవేశపెట్టే తాజా చర్యపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారని.. ఈ కీలకమైన అంశంపై ఇతర ఐదుగురు ప్రముఖ మాజీ చైర్మన్లు కూడా ఎందుకు స్పందించడం లేదు..? అని ప్రశ్నించారు. ఈ మేరకు జైరామ్ రమేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
There have been news reports in the past couple of days on ISRO’s future role in our country’s space programme. This has raised legitimate concerns given its capacities, capabilities, and competencies built up so methodically and painstakingly over the past six decades thanks to…
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 24, 2026
Also Read..
ట్రావెల్ వీడియోల కోసం.. ఏడాదికి రూ.85 లక్షల ప్యాకేజీ ఉద్యోగాన్ని వదులుకున్న టెకీ
అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!
సంబంధిత వార్తలు

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
ఆగస్టు 24, 2026

Mahesh Goud | కార్యకర్తల వల్లే కాంగ్రెస్‌కు అధికారం.. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్
- ●Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!
- ●Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం
- ●Marathi Language Rule Mumbai | మరాఠీ రాకపోతే రూ.20 వేలు ఫైన్.. ముంబైలో భగ్గుమన్న ఆటో డ్రైవర్లు.. 3 రోజుల బంద్
- ●Circuit House Issue | సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా.. అత్యవసర విచారణకు నో..!
- ●Polytechnic Colleges Bandh | పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్: ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ABVP పిలుపు

Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్

Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై ట్రోల్.. ఇదేం విడ్డూరం అంటూ సోషల్ మీడియాలో విసుర్లు..!

Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం

Marathi Language Rule Mumbai | మరాఠీ రాకపోతే రూ.20 వేలు ఫైన్.. ముంబైలో భగ్గుమన్న ఆటో డ్రైవర్లు.. 3 రోజుల బంద్



