త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Workers | విదేశాల్లో రోజుకు 20 మంది భార‌తీయ కార్మికులు మ‌ర‌ణిస్తున్నారు.. గ‌ల్ఫ్‌లోనే అత్య‌ధికం : కేంద్రం

Indian Workers | గ‌త ఐదేళ్ల‌లో ప్ర‌తి రోజూ స‌గ‌టున 20 మందికిపైగా భార‌తీయ కార్మికులు (Indian Workers) విదేశీ గ‌డ్డ‌పై ప్రాణాలు కోల్పోతున్నార‌ని (Indian Workers Died Abroad ) కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

D

National | Published On Apr 2, 2026, 4.41 pm IST

Indian Workers | విదేశాల్లో రోజుకు 20 మంది భార‌తీయ కార్మికులు మ‌ర‌ణిస్తున్నారు.. గ‌ల్ఫ్‌లోనే అత్య‌ధికం : కేంద్రం
Advertisement

Indian Workers | గ‌త ఐదేళ్ల‌లో ప్ర‌తి రోజూ స‌గ‌టున 20 మందికిపైగా భార‌తీయ కార్మికులు (Indian Workers) విదేశీ గ‌డ్డ‌పై ప్రాణాలు కోల్పోతున్నార‌ని (Indian Workers Died Abroad ) కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అందులో అత్య‌ధిక మ‌ర‌ణాలు గ‌ల్ఫ్ దేశాల్లోనే (Gulf Countries) న‌మోదైన‌ట్లు తెలిపింది. విదేశాల్లో కార్మికుల దుస్థితిపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు.. జ‌న‌వ‌రి 29న రాజ్య‌స‌భ‌లో (Rajya Sabha) విదేశీ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి కీర్తి వ‌ర్ధ‌న్ సింగ్ (Kirti Vardhan Singh) లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానమిచ్చారు. 2021-25 మ‌ధ్య కాలంలో విదేశాల్లో మ‌ర‌ణించిన భార‌తీయ కార్మికుల సంఖ్య 37,740గా ఉంద‌న్నారు. అయితే, వారి మ‌ర‌ణాల‌కు గ‌ల కార‌ణాల‌ను మాత్రం ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌లేదు.

ప్ర‌భుత్వం తెలిపిన గ‌ణాంకాల ప్ర‌కారం.. 2021లో అత్య‌ధికంగా 8,234 మంది కార్మికులు మ‌ర‌ణించారు. 2022లో ఆసంఖ్య 6,614కు త‌గ్గింది. మ‌ళ్లీ 2023లో స్వ‌ల్పంగా పెరిగి మ‌ర‌ణాలు 7,291కు చేరాయి. 2024లో 7,747 మంది, 2025లో ఆసంఖ్య 7,854గా ఉంది. ఈ మొత్తం మ‌ర‌ణాల్లో 86 శాతం గ‌ల్ఫ్ దేశాల్లోనే న‌మోదైన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ఐదేళ్ల‌లో అత్య‌ధికంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో 12,380 మంది, సౌదీ అరేబియాలో 11,757 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కువైట్‌లో 3,890 మంది, ఒమన్ (2,821), మలేషియా (1,915), ఖతార్‌లో 1,760 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఐదేళ్ల కాలంలో వేధింపులు, దోపిడీ, ప‌ని ప్ర‌దేశాల్లో స‌మ‌స్య‌ల‌కు సంబంధించి భార‌త రాయ‌బార కార్యాల‌యాల‌కు మొత్తం 80,985 ఫిర్యాదులు అందాయి. ఇందులో కూడా 16,965 ఫిర్యాదుల‌తో యూఏఈ అగ్ర‌స్థానంలో ఉంది. కువైట్ (15,234), ఒమన్ (13,295), సౌదీ అరేబియా (12,988) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2018 నాటి పీటీఐ (PTI) నివేదిక ప్ర‌కారం.. 2012-18 మధ్య కాలంలో గల్ఫ్ దేశాల్లో ప్రతిరోజూ దాదాపు 10 మంది భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆరేళ్ల కాలంలో బహ్రెయిన్, ఒమన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ (UAE) దేశాల్లో కనీసం 24,570 మంది భారతీయ కార్మికులు మరణించినట్లు కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (CHRI) నివేదిక‌ పేర్కొంది. ఈ గ‌ణాంకాల‌తోపోలిస్తే.. తాజా ప్ర‌భుత్వ గ‌ణాంకాలు ఆందోళ‌న క‌లిగించేలా ఉన్నాయి. బహ్రెయిన్ మినహా మిగిలిన గల్ఫ్ దేశాల్లో 2021 -25 మధ్య కాలంలో 32,608 మంది భారతీయ కార్మికులు మరణించారు. అంటే గత ఐదేళ్లలో కేవలం గల్ఫ్ ప్రాంతంలోనే సగటున ప్రతిరోజూ దాదాపు 18 మంది కార్మికులు మరణిస్తున్నారు.

Also Read..

ఆప్ డిప్యూటీ లీడ‌ర్ ప‌ద‌వి నుంచి రాఘ‌వ్ చద్ధా తొల‌గింపు.. స‌భ‌లో మాట్లాడేందుకు స‌మ‌యం ఇవ్వొద్దంటూ లేఖ‌

న్యాయ‌మూర్తి నోట Floccinaucinihilipilification ప‌దం.. అస‌లు దీని అర్థ‌మేంటి..?

ఐఫోన్ల‌తో చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్లిన వ్యోమ‌గాములు.. చ‌రిత్ర‌లో తొలిసారి

Advertisement
Advertisement