త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Food Poisoning | పోలీస్ లైన్ మెస్‌లో క‌లుషిత ఆహారం.. 100 మందికిపైగా పోలీసుల‌కు అస్వ‌స్థ‌త‌

Food Poisoning | పోలీస్ లైన్ మెస్‌లో ఆహారం తిన్న(Food Poisoning) వంద మందికిపైగా పోలీసు అధికారులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో వారంతా ద‌వాఖాన పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

G

National | Published On Mar 14, 2026, 12.01 pm IST

Food Poisoning | పోలీస్ లైన్ మెస్‌లో క‌లుషిత ఆహారం.. 100 మందికిపైగా పోలీసుల‌కు అస్వ‌స్థ‌త‌
Advertisement

Food Poisoning | త్రినేత్ర‌.న్యూస్‌: పోలీస్ లైన్ మెస్‌లో ఆహారం తిన్న(Food Poisoning) వంద మందికిపైగా పోలీసు అధికారులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో వారంతా ద‌వాఖాన పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

బీహార్‌లోని బంకా జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ మెస్‌లో రోజూలానే పోలీసు సిబ్బంది ఆహారం తిన్నారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే క‌డుపు నొప్పి, వాంతుల‌తో ప‌లువ‌రు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాదు. దీంతో 100 మందికిపైగా పోలీసు సిబ్బందిని స‌హ‌చ‌రులు బాంకా స‌ర్దార్ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్రాథమిక చికిత్స అంన‌త‌రం ప‌లువురు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అవ‌గా, మ‌రికొంద‌రు ఇంకా చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్ల‌డించారు.

జిల్లా క‌లెక్ట‌ర్ న‌వ్‌దీప్ శుక్లా, ఐజీ వివేక్ కుమార్‌ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న‌వారిని ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌కు ఆహారం క‌ల్తీ కావ‌డ‌మే కార‌ణ‌మ‌ని అనుమానిస్తున్నారు. ఫుడ్‌పాయిజ‌న్‌పై ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు.

Also Read..

పోలీస్ లైన్ మెస్‌లో క‌లుషిత ఆహారం.. 100 మందికిపైగా పోలీసుల‌కు అస్వ‌స్థ‌త‌

భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. బ‌ల‌ప‌డుతున్న అమెరికా డాల‌ర్‌..

రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు..

Advertisement
Advertisement