Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం( Hydroponic Farm ).. ఈ పదం చాలా మంది రైతులకు( Farmers ) తెలియదు. మట్టితో కాకుండా కేవలం నీటితో పంటలను సాగు చేయడం. అంటే కోకోపీట్, ఇసుక, కంకర, పెర్లైట్ వంటి వాటిని ఉపయోగించి హైడ్రోఫోనిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడం. ఇలా హైడ్రోఫోనిక్ వ్యవసాయం చేస్తూ ఏడాదికి ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్నాడు ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్( IIM MBA Graduate ).
Agriculture | Published On May 19, 2026, 3.16 pm IST
సంక్షిప్త సారాంశం
ఇటీవలి కాలంలో చాలా మంది యువత వ్యవసాయం( agriculture ) వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇంజినీరింగ్, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు పొలం బాట పడుతున్నారు. అధునాతన పద్ధతులను అవలంభించి ఏడాదికి లక్షల రూపాయాలు సంపాదిస్తున్నారు. ఈ ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్( IIM MBA Graduate ) కూడా సరికొత్తగా హైడ్రోఫోనిక్ వ్యవసాయం( Hydroponic Farm ) చేస్తూ ఎకరాకు ఏడాదికి రూ. 57 లక్షలు సంపాదిస్తున్నాడు. అతను సంపాదనకే పరిమితం కాలేదు.. హైడ్రోఫోనిక్ వ్యవసాయంపై రైతులకు( Farmers ) అవగాహన కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి ఆ యువ రైతు( Young Farmer ) గురించి తెలుసుకోవాలంటే ఉత్తరాఖండ్( Uttarakhand ) లో అడుగుపెట్టాల్సిందే.
Hydroponic Farm | త్రినేత్ర.న్యూస్ : బీహార్( Bihar )లోని దర్భంగా( Darbhanga )కు చెందిన చంద్రమణి( Chandramani )కి మొక్కలన్నా.. వ్యవసాయమన్నా ఎంతో ఇష్టం. ఎలాగైనా అగ్రికల్చర్ కోర్సు( Agriculture Course ) చేయాలనే తపన ఉండడంతో.. ఉత్తరాఖండ్( Uttarakhand ) వెళ్లాడు. మొత్తానికి బీఎస్సీ అగ్రికల్చర్ పట్టా పుచ్చుకున్నాడు. భార్సార్ యూనివర్సిటీ నుంచి 2021లో పీజీ కూడా పూర్తి చేశాడు. పోస్టు గ్రాడ్యుయేట్‌తోనే తన చదువును ఆపేయలేదు.. కాశీపూర్ ఐఐఎం నుంచి ఎంబీఏ( IIM MBA ) పూర్తి చేశాడు 2022లో.
పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో చంద్రమణి.. పాలీహౌస్, హైడ్రోఫోనిక్ వ్యవసాయం( Hydroponic Farm ) మీద దృష్టి సారించాడు. మట్టిలో పండించే పంటలకు భిన్నంగా హైడ్రోఫోనిక్ పద్ధతిలో మొక్కలను పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ మొక్కల వేర్లకు ఆధారం కోసం కంకర, ఇసుక, కోకోపీట్ లేదా పెర్లైట్ వంటి వాటిని ఉపయోగించొచ్చని తెలుసుకున్నాడు.
అగ్రిజాయ్ పేరుతో స్టార్టప్.. తొలి ప్రయత్నంలోనే రూ. 9 లక్షల వరకు ఆదాయం..
హైడ్రోఫోనిక్‌లో అనుభవం సంపాదించడానికి.. 2020లో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 500 చ.మీ. విస్తీర్ణంలో నిరుపయోగంగా ఉన్న ఒక పాలీహౌస్‌ను లీజుకు తీసుకున్నాడు. ఇందులో అరుదైన కూరగాయలను పండించడానికి పూనుకున్నాడు. అగ్రిజాయ్ పేరుతో తన స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనేక పాఠాలు నేర్చుకున్నాడు. పాలకూర వంటి ఆకుకూరలను పండించాడు. క్యాప్సికమ్, టమాట, దోసకాయ వంటి కూరగాయలను కూడా పండించాడు. ఇందుకోసం దాదాపు 10 వేల మొక్కలు నాటాడు. మొత్తానికి 10 వేల కిలోల ఆకుకూరలను ఉత్పత్తి చేయగా, కిలో ఆకుకూరలను రూ. 80 నుంచి రూ. 85 చొప్పున విక్రయించాడు. సుమారు రూ. 9 లక్షల వరకు తొలి ప్రయత్నంలోనే ఆదాయం సమకూరింది.
అర ఎకరంలో క్యాప్సికమ్, టమాటా.. మిగిలిన అర ఎకరా పొలంలో ఆకుకూరలు..

ఈ అనుభవం ద్వారా తన పాలీహౌస్‌లో మార్పులు చేర్పులు చేపట్టాడు. మొదటగా 4.5 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఏర్పాటు చేయగా, దాన్ని దాదాపు 7.5 నుంచి 8 మీటర్ల వరకు పెంచాడు. గాలి ప్రసరణ కూడా ప్రధాన సమస్యగా ఉండే. గాలి వచ్చేందుకు ఏర్పాటు చేసిన రంధ్రాలను కూడా 1.5 మీటర్లకు విస్తరించాడు. మొత్తానికి గాలి నిరంతరం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్ల వల్ల వ్యాధుల ప్రభావం తగ్గి.. గణనీయంగా దిగుబడి పెరిగింది. అయితే తన ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు 2021లో 12 ఏండ్ల కాలానికి ఒక ఎకరం భూమిని లీజుకు తీసుకున్నాడు చంద్రమౌళి. ఇక అర ఎకరంలో క్యాప్సికమ్, టమాటాలు వంటి పండ్లను పండించాడు. మిగిలిన అర ఎకరా పొలంలో ఆకుకూరలు సాగు చేశాడు.
ఏడాదిలోనే రూ. 43 లక్షల టర్నోవర్‌కు
అర ఎకరంలో 6500 పండ్ల మొక్కలను నాటాడు. ప్రతి మొక్క 3 కిలోల వరకు దిగుబడిని ఇచ్చింది. ఏడాదికి రెండు పంట కాలాలతో ఒక్కో మొక్క నుంచి సుమారు 6 కిలోల వరకు దిగుబడి వచ్చింది. కిలో పండ్లను రూ. 100కు విక్రయించడంతో.. ఏడాదిలోనే చంద్రమణి బిజినెస్ రూ. 43 లక్షల టర్నోవర్‌కు చేరింది. ఇక ఖర్చులు పోనూ రూ. 10 లక్షల ఆదాయం మిగిలింది.
ఖర్చులు పోనూ ఎకరానికి రూ. 30 లక్షలు ఆదా
ఉన్న ఎకరాకు అదనంగా మరో ఐదు ఎకరాలను జోడించాడు. ఈ ఆరు ఎకరాల్లో క్యాప్సికమ్, టమాటలను పండిస్తున్నాడు. డెహ్రాడూన్‌లో ఆరు ఎకరాలు, ఏపీలోని ఏలూరులో ఒక ఎకరం వరకు తన సాగును విస్తరించాడు. మొత్తంగా ఆరు ఎకరాల విస్తీర్ణంలో 72 వేల మొక్కలు నాటాడు. అంటే ఎకరానికి 12 వేలు మొక్కలు నాటాడు. కోకోపీట్ ఉపయోగించి హైడ్రోఫోనిక్ వ్యవసాయం చేస్తున్నాడు. ఒక్కో మొక్క ఏడాదికి 6 కిలోల దిగుబడిని ఇస్తుంది. డెహ్రాడూన్, ఢిల్లీ మార్కెట్లలో కిలో కూరగాయలను రూ. 80 విక్రయిస్తూ.. ఎకరానికి రూ. 57 లక్షల వార్షిక టర్నోవర్‌కు చేరుకున్నాడు చంద్రమణి. ఖర్చులు కూడా ఎక్కువే. కూలీలు, విద్యుత్, ఆటోమేషన్ వ్యవస్థలతో పాటు ఇతరత్రా ఖర్చులు పోనూ ఎకరానికి రూ. 30 లక్షలు ఆదా అవుతుంది. ప్రస్తుతం ఎకరానికి నికర లాభం రూ. 26 లక్షలుగా ఉంది. మొత్తంగా హైడ్రోఫోనిక్ వ్యవసాయం అతనికి లాభసాటిగా మారింది.
ఉత్పత్తి కేంద్రాలే కాదు.. శిక్షణా కేంద్రాలు కూడా
ఇక డెహ్రాడూన్, ఏలూరులోని తన వ్యవసాయ క్షేత్రాలు ఉత్పత్తి కేంద్రాలుగానే మిగిలిపోలేదు. స్థానిక రైతులకు హైడ్రోఫోనిక్ వ్యవసాయంపై శిక్షణా కేంద్రాలుగా మారిపోయాయి. ఒక్క రైతులే కాదు.. స్థానికంగా ఉన్న అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు కూడా తమ ఇంటర్న్‌షిప్‌లకు ఎంపిక చేసుకుంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minor Girl Harassed | బీహార్‌లో మరో మైనర్‌పై దాడి.. వారం రోజుల్లో మూడో ఘటన
సెప్టెంబర్ 25, 2026

Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
సెప్టెంబర్ 25, 2026

Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



