Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బలపడుతున్న అమెరికా డాలర్..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం రోజు రోజుకీ తీవ్రతరం అవుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం పెరగడం లేదు. వరుసగా ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. పెట్టుబడిదారులు లాభాల బుకింగ్‌కు చూస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయని, ఇది స్వల్పకాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధం రోజు రోజుకీ తీవ్రతరం అవుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం పెరగడం లేదు. వరుసగా ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. పెట్టుబడిదారులు లాభాల బుకింగ్‌కు చూస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయని, ఇది స్వల్పకాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు శుక్రవారం రాత్రి సెషన్ ముగిసే సమయానికి 1805 పాయింట్లు (1.13 శాతం) నష్టపోయి 1,58,466 వద్ద ముగిసింది. అలాగే సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 8527 పాయింట్లు (3.18 శాతం) పతనం అయి 2,59,435 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలపడడం కూడా బంగారం, వెండి ధరల తగ్గుదలకు కారణం అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 58 డాలర్లు తగ్గి 5020.60 వద్ద ముగిసింది. మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ మరింత పతనం అయింది. డాలర్‌కు 92.49 వద్ద మార్కెట్ స్థిరపడింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,966 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,27,728గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,59,660గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,96,600 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,300 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,635 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,63,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,500 తగ్గింది. 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,974 ఉండగా, 8 గ్రాముల ధర రూ.95,792గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,19,740 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,97,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750గా ఉంది. నిన్నటితో పోలిస్తే కిలోకు రూ.4900 తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2.80 లక్షలు ఉండగా, తులం ధర రూ.2,800గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



