త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | టాలీవుడ్‌కు అందుకే గ్యాప్ – ఆ త‌ప్పు వ‌ల్లే ఫ్లాపులొచ్చాయి – శ్రీలీల కామెంట్స్ వైర‌ల్‌

తెలుగు సినిమాల‌కు గ్యాప్‌తో పాటు వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర‌వ్వ‌డంపై ఓం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. ఏది ప‌డితే ఆ సినిమా చేసి త‌ప్పుచేశాన‌ని అన్న‌ది. ఆమె కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Nov 17, 2026, 12.03 pm IST

Sreeleela | టాలీవుడ్‌కు అందుకే గ్యాప్  – ఆ త‌ప్పు వ‌ల్లే ఫ్లాపులొచ్చాయి  – శ్రీలీల కామెంట్స్ వైర‌ల్‌
Advertisement

Sreeleela | తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇవ్వ‌డంపై ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. వ‌రుస ప‌రాజ‌యాల‌పై కూడా రియాక్ట్ అయ్యింది. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ ఓం న‌వంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ధ‌నుష్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి మ‌రో నాయిక‌గా క‌నిపించ‌బోతుంది. ఓం సినిమా తెలుగులో అదే పేరుతో డ‌బ్ కాబోతుంది. తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో త‌న కెరీర్‌పై శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

రెడీగా లేను....

"నా మెడిసిన్ పూర్తయిన తర్వాత ముంబైలో ఇంటర్న్‌షిప్ చేశా. ఆ సమయంలో చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ నేను అప్పుడు సినిమాలు చేయ‌డానికి రెడీగా లేను. ఇంట‌ర్న‌షిప్‌పై దృష్టిసారించాల‌నే చాలా అవ‌కాశాలు వ‌దులుకున్నా. అప్పుడే ఓం కథ విన్నాను. చాలా బాగా నచ్చింది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామికి మొదటిసారి కలిసినప్పుడు ఈ సినిమాలో నా పాత్ర‌కు పాటలు ఉండవని చెప్పారు. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. న‌టిగా న‌న్ను నేను భిన్నంగా ఆవిష్క‌రించుకోవ‌డానికి వ‌చ్చిన అవ‌కాశంగా భావించి ఈ సినిమా అంగీక‌రించా. నా కెరీర్‌లో ఈ సమయంలో ఇలాంటి సినిమా చేయడం చాలా ముఖ్యం" అని శ్రీలీల అన్న‌ది.

చిన్న వ‌య‌సులోనే...

'చిన్న వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టా. వ‌చ్చిన ప్ర‌తి సినిమాను అంగీక‌రించా. ఏది ప‌డితే అది చేశా. నేను చేసిన త‌ప్పేంటో ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. అందుకే సినిమాల ఎంపిక‌లో ఇప్పుడు జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నా" అని శ్రీలీల చెప్పింది.

ఫిదా రిలీజ్‌...

"నేను డాక్టర్‌గా చదువుకుంటున్న సమయంలో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ సినిమా విడుదలైంది. ఒక డాక్టర్ అమ్మాయి సినిమాలో హీరోయిన్‌గా నటించడం చూసి చాలా గొప్పగా అనిపించింది. నేను హీరోయిన్ కావ‌డానికి స్ఫూర్తి నిచ్చిన వారిలో సాయిప‌ల్ల‌వి ఒక‌రు" అని శ్రీలీల తెలిపింది.

ఓం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాలోని ఓ పాట‌కు స్టేజ్‌పై సాయిప‌ల్ల‌వితో క‌లిసి శ్రీలీల స్టెప్పులు వేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

Advertisement
Advertisement