Menstrual Leaves | అలా చేస్తే మహిళల్ని ఎవరూ ఉద్యోగాల్లోకి తీసుకోరు.. నెలసరి సెలవులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Menstrual Leaves | మహిళలకు (Women) నెలసరి సెలవులు (Menstrual Leaves) తప్పనిసరి చేస్తే అది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) అభిప్రాయపడ్డారు.
Menstrual Leaves | మహిళలకు (Women) నెలసరి సెలవులు (Menstrual Leaves) తప్పనిసరి చేస్తే అది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) అభిప్రాయపడ్డారు. రుతుక్రమ సెలవులు తప్పనిసరిగా ఇవ్వాలన్న చట్టాన్ని అమలు చేస్తే దాని వల్ల మహిళల్ని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోరని పేర్కొన్నారు. మహిళలకు నెలసరి సమయంలో ఇచ్చే లీవులకు సంబంధించిన నియమాలను రూపొందించేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి (Lawer Shailendra Mani Tripathi) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి చట్టాలతో మహిళలకే సమస్య వస్తుందని పేర్కొన్నారు. పురుషుల కన్నా తాము తక్కువ అన్న భావన వారిలో కలుగుతుందని వ్యాఖ్యానించారు. "అవగాహన కల్పించడం, సున్నితత్వం పెంచడం వేరు. కానీ మీరు రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తెచ్చిన మరుక్షణమే మహిళల్ని ఎవరూ పనిలోకి తీసుకోరు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదు" అని సీజేఐ పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థినులు, వర్కింగ్ ఉమెన్స్‌కు నెలసరి సమయంలో లీవులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. ఇలాంటి అభ్యర్థనల వల్ల భయాందోళనలను పెరుగుతాయని సీజేఐ స్పష్టం చేశారు. దీని వల్ల మహిళలను బలహీనులుగా చూస్తారని, నెలసరి అనేది వారికి ఏదో చెడు జరుగుతుందని భావిస్తారని వివరించారు.
పిటిషన్ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎం.ఆర్. శంషాద్ వాదనలు వినిపిస్తూ.. 2013లో కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థినులకు రుతుక్రమ సెలవులను మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. లింగ సమానత్వ సమాజాన్ని సాకారం చేసే నిబద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు కూడా మహిళలకు ఇలాంటి వెసులుబాటు కల్పించాయని కోర్టుకు వెల్లడించారు.
అవి స్వచ్ఛందంగా తీసుకునే చర్యలు..
అయితే, ఇవి స్వచ్ఛందంగా తీసుకునే చర్యలని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. "వీటిని చట్టప్రకారం తప్పనిసరి చేస్తే.. మరుక్షణం మహిళలకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరు. వారి కెరీర్ ముగిసిపోతుంది. మీరు ఇక ఇంట్లోనే కూర్చోండి అని అంటారు" అని న్యాయమూర్తి చెప్పుకొచ్చారు.
Also Read..
అమెరికా అబ్రహం లింకన్‌పై క్షిపణులతో దాడి చేశాం : ఇరాన్
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన
ఆయన బతికే ఉన్నాడని అనుకుంటున్నా.. మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు

Danam Nagender | దానం నాగేందర్ ఎమ్మెల్యే కాదు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్
సెప్టెంబర్ 28, 2026

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే
సెప్టెంబర్ 28, 2026

Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
- ●Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!
- ●Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా
- ●TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్
- ●Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత

Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి

Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..

Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా



