Shortage Of LPG Gas Cylinders | ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన
Shortage Of LPG Gas Cylinders | దేశంలో ఎల్పీజీ కొరతపై (Shortage Of LPG Gas Cylinders) ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు (Opposition MPs) ఆందోళన బాటపట్టారు.
Shortage Of LPG Gas Cylinders | దేశంలో ఎల్పీజీ కొరతపై (Shortage Of LPG Gas Cylinders) ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు (Opposition MPs) ఆందోళన బాటపట్టారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
https://x.com/ANI/status/2032326524842754477
మరోవైపు ఎల్పీజీ (LPG) గ్యాస్ సంక్షోభంపై నిన్న పార్లమెంట్‌లో వాడీవేడి చర్చ జరిగింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. దేశంలో డీజిల్, పెట్రోల్ లేదా కిరోసిన్ కొరత ఏమీ లేదని కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి లోక్‌సభలో స్పష్టం చేశారు. సప్లై చైన్ అంతా సాఫీగా సాగుతోందని ఆయన తెలపగా.. ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఉందని రాహుల్ గాంధీ సభ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
https://x.com/ANI/status/2032327505227698587
కొవిడ్ తరహాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని అధిగమిస్తాం
కొవిడ్ (Covid) మహమ్మారి సమయంలో మాదిరిగానే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల తలెత్తిన ఎల్పీజీ సంక్షోభాన్ని (LPG crisis) భారత్ అధిగమిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విశ్వాసం వ్యక్తం చేశారు. "140 కోట్ల మంది భారతీయులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కొవిడ్ మహమ్మారి సమయం మాదిరిగానే మనం ఈ సంక్షోభాన్ని కూడా అధిగమిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల మన పౌరులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకూడదనేదే మా స్పష్టమైన సంకల్పం" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Also Read..
కొవిడ్ తరహాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని మనం అధిగమిస్తాం : ప్రధాని మోదీ
ఆయన బతికే ఉన్నాడని అనుకుంటున్నా.. మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
- ●Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..
- ●Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
- ●Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి

Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..

Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి






