USS Abraham Lincoln | అమెరికా అబ్రహం లింకన్‌పై క్షిపణులతో దాడి చేశాం : ఇరాన్
USS Abraham Lincoln | అమెరికాకు చెందిన విమాన వాహననౌక అబ్రహం లింకన్‌పై దాడి చేసినట్లు ఇరాన్ (Iran) ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులతో ఈ యుద్ధ విమాన వాహన నౌకను ఢీ కొట్టినట్లు పేర్కొంది.
International | Published On Mar 13, 2026, 12.39 pm IST
USS Abraham Lincoln | అమెరికాకు చెందిన విమాన వాహననౌక అబ్రహం లింకన్‌పై దాడి చేసినట్లు ఇరాన్ (Iran) ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులతో ఈ యుద్ధ విమాన వాహన నౌకను ఢీ కొట్టినట్లు పేర్కొంది. తమ దాడిలో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి పారిపోయిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది.
"ఇరాన్ సముద్ర జలాల సరిహద్దులకు సుమారు 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న USS అబ్రహం లింకన్ యుద్ధనౌకపై అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లతో ఖచ్చితమైన దాడి నిర్వహించాం. ఈ దాడి తర్వాత అబ్రహం లింకన్‌తోపాటూ ఇతర నౌకల బృందం అత్యంత వేగంతో ఆ ప్రాంతం నుంచి పారిపోయింది" అని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది.
అయితే, ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ సురక్షితంగానే ఉందని.. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీకి మద్దతిస్తోందని అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇరాన్‌కు చెందిన ఓ నౌక .. అబ్రహం లింకన్ యుద్ధ నౌకకు అతి సమీపంగా వచ్చిందని తెలిపింది. దానిపై అమెరికన్ దళాలు ఫైర్ చేశాయని తెలిపింది. అయితే, షిప్‌కు ఏమైందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.
https://x.com/CENTCOM/status/2032175299811549449
Also Read..
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన
ఆయన బతికే ఉన్నాడని అనుకుంటున్నా.. మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నిన్న బెంగళూరులో.. నేడు చెన్నైలో.. ఇడ్లీ, వడతోపాటు గ్యాస్‌కీ చార్జీలు.. హోటల్ బిల్లు వైరల్
తాజావార్తలు
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
- ●Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..
- ●Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
- ●Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి

Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..

Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి






