Donald Trump | ఆయన బతికే ఉన్నాడని అనుకుంటున్నా.. మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
Donald Trump | ఇరాన్ నూతన సుప్రీం లీడర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ఆయన ఏదో ఒక రూపంలో ఇంకా బతికే ఉన్నారని (Mojtaba Khamenei Alive In Some Form) వ్యాఖ్యానించారు.
International | Published On Mar 13, 2026, 10.56 am IST
Donald Trump | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. దాడులు, ప్రతిదాడులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇక ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఇక అదే దాడిలో ఆయన కుమారుడు, నూతన సుప్రీం లీడర్‌గా (Irans new Supreme Leader) ఎన్నికైన మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారంటూ అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. ఈ నేపథ్యంలో మొజ్తాబా ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు.
ఆయన ఏదో ఒక రూపంలో ఇంకా బతికే ఉన్నారని (Mojtaba Khamenei Alive In Some Form) వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ రేడియోలో మాట్లాడుతూ.. "నాకు తెలిసి మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారు. ఆయన ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడని అనుకుంటున్నాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గాయాల వార్తల వేళ ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కోమాలో మొజ్తాబా ఖమేనీ..?
మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం కోమాలో (Mojtaba Khamenei in coma) ఉన్నట్లు బ్రిటిష్ పత్రిక ది సన్ నివేదిస్తోంది. ఇజ్రాయెల్-యూఎస్ జరిపిన సంయుక్త దాడిలో అతను తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. ఈ దాడిలో మొజ్తాబా ఖమేనీ ఓ కాలు కూడా కోల్పోయినట్లు సదరు పత్రిక నివేదిస్తోంది (Mojtaba Khamenei lost a leg). ప్రస్తుతం టెహ్రాన్‌లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు, దాడుల్లో ఆయన కాలేయం కూడా దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ సదరు పత్రిక నివేదిస్తోంది.
"ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఇక ఇదే దాడిలో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారు. టెహ్రాన్‌లోని సినా యూనివర్శిటీ ఆసుపత్రిలో ఖమేనీకి గట్టి భద్రత నడుమ చికిత్స అందిస్తున్నారు. అతను చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఓ కాలు కూడా పోయింది. లివర్ దెబ్బతిన్నది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు" అని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ది సన్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి మొజ్తాబా ఖమేనీ ఎలాంటి నాయకత్వం వహించడం లేదని తెలిపింది.
Also Read..
PM Modi | కొవిడ్ తరహాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని మనం అధిగమిస్తాం : ప్రధాని మోదీ
Stock Markets | స్టాక్ మార్కెట్లలో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Benjamin Netanyahu | ఐక్యరాజ్యసమితిలో నెతన్యాహు ప్రసంగం.. 90 శాతం సీట్లు ఖాళీ
సెప్టెంబర్ 25, 2026

Trump Xi Jinping Summit US China | ట్రంప్ – జిన్‌పింగ్ మెగా సమ్మిట్: ఏఐ, ట్రేడ్, మిడిల్ ఈస్ట్ యుద్ధంపై ప్రపంచం దృష్టి
సెప్టెంబర్ 24, 2026

Xi Jinping | బీ-1 బాంబర్లు, 100 అడుగుల రెడ్ కార్పెట్.. అమెరికాలో జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్కమ్
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
- ●Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..
- ●Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
- ●Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి

Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..

Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి



