CEC Gyanesh Kumar | అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరునూ తొలగించం : సీఈసీ జ్ఞానేశ్ కుమార్
CEC Gyanesh Kumar | ఓటరు జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరునూ తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) స్పష్టం చేశారు.
CEC Gyanesh Kumar | ఓటరు జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరునూ తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సీఈసీ పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించడమే ఎన్నికల కమిషన్ (Election Commission) లక్ష్యమని వెల్లడించారు.
బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులంతా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సూచనల మేరకే పనిచేయాలని స్పష్టం చేశారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని సీఈసీ హెచ్చరించారు. "అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించబోము. బెంగాల్‌లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే మా లక్ష్యం. అర్హత కలిగిన ప్రతి ఓటరుకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం" అని సీఈసీ స్పష్టం చేశారు.
100 శాతం వెబ్‌కాస్టింగ్
బెంగాల్‌లో సుమారు 80,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. అందులో దాదాపు 61,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా, అత్యంత నిష్పక్షపాతంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
కోల్‌కతాలో జ్ఞానేష్ కుమార్‌కు నిరసన సెగ
రాష్ట్ర పర్యటన సందర్భంగా జ్ఞానేశ్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది. మంగళవారం ఉదయం దక్షిణేశ్వర్ కాళీ ఆలయ సందర్శన సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది సీఈసీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. 'గో బ్యాక్' నినాదాలు చేస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
పశ్చమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రక్రియలో పాలు పంచుకుంటున్న న్యాయ అధికారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారంటూ ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్స్‌లో ఇప్పటి వరకు సుమారు 10.16లక్షల దరఖాస్తులను న్యాయాధికారులు విచారించినట్లు కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్ ప్రక్రియలో కొత్తగా ఎలాంటి తప్పనిసరి చర్యలను అమలు చేయకూడదని స్పష్టం చేసింది. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘం పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read..
Iran War | 1,900 మంది ఇరాన్ సైనికుల్ని హతమార్చాం : ఇజ్రాయెల్
Mrunal Thakur | అప్పుడు తెలుగులో - ఇప్పుడు బాలీవుడ్‌లో - మృణాల్‌కు మరోసారి షాకిచ్చిన యశ్
రేవంత్ రెడ్డి గారూ.. మీరు అలా చేస్తే గాంధీ కీర్తి దెబ్బతింటుంది : తుషార్ గాంధీ
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



