త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tushar Gandhi | రేవంత్ రెడ్డి గారూ.. మీరు అలా చేస్తే గాంధీ కీర్తి దెబ్బ‌తింటుంది : తుషార్ గాంధీ

Tushar Gandhi | తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్మించ‌బోయే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుపై మ‌హాత్మా గాంధీ మ‌నుమడు తుషార్ గాంధీ మ‌రోసారి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌జ‌ల ఇళ్లు కూల్చి గాంధీ విగ్ర‌హం నిర్మిస్తే ఆయ‌న కీర్తి దెబ్బ తింటుంద‌ని తుషార్ గాంధీ పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 10, 2026, 3.41 pm IST

Tushar Gandhi | రేవంత్ రెడ్డి గారూ.. మీరు అలా చేస్తే గాంధీ కీర్తి దెబ్బ‌తింటుంది : తుషార్ గాంధీ
Advertisement

Tushar Gandhi | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్మించ‌బోయే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుపై మ‌హాత్మా గాంధీ మ‌నుమడు తుషార్ గాంధీ మ‌రోసారి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌జ‌ల ఇళ్లు కూల్చి గాంధీ విగ్ర‌హం నిర్మిస్తే ఆయ‌న కీర్తి దెబ్బ తింటుంద‌ని తుషార్ గాంధీ పేర్కొన్నారు. కేవ‌లం గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు కోస‌మే వాళ్ల ఇళ్లు కోల్పోతున్నారనే అపోహ‌లు వ్యాపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల వ‌ల్ల స‌మాజంలో గాంధీని అప్ర‌తిష్ట‌పాలు చేసే ప్ర‌చారానికి ఆజ్యం పోస్తోంది. ఆ అపోహాల‌ను నివృత్తి చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుతున్నాన‌ని తుషార్ గాంధీ పేర్కొన్నారు.

https://x.com/TusharG/status/2031247324840919440

Advertisement
Advertisement