త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran War | 1,900 మంది ఇరాన్ సైనికుల్ని హ‌త‌మార్చాం : ఇజ్రాయెల్‌

Iran War | గ‌త‌నెల 28న యుద్ధం (Iran War) మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 1900 మంది ఇరాన్ సైనికులు (Iranian soldiers), క‌మాండ‌ర్లు మ‌ర‌ణించిన‌ట్లు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది.

D

International | Published On Mar 10, 2026, 3.59 pm IST

Iran War | 1,900 మంది ఇరాన్ సైనికుల్ని హ‌త‌మార్చాం : ఇజ్రాయెల్‌
Advertisement

Iran War | గ‌త‌నెల 28న యుద్ధం (Iran War) మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 1900 మంది ఇరాన్ సైనికులు (Iranian soldiers), క‌మాండ‌ర్లు మ‌ర‌ణించిన‌ట్లు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఇజ్రాయెల్ (Israel) మిలిట‌రీ ప్ర‌తినిధి ఎఫీ డెఫ్రిన్ (Effie Defrin) వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో ఇరాన్ దాడుల వ‌ల్ల ఇజ్రాయెల్‌లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు చెప్పారు. ఇక లెబ‌నాన్‌లో హిజ్బుల్లా ఫైట‌ర్ల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇద్ద‌రు ఐడీఎఫ్ సైనికులు మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు.

ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌కారం.. యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా 2,238 మంది గాయ‌ప‌డ్డారు. వారంతా ఆసుప‌త్రుల్లో చేరి చికిత్స పొందారు. వీరిలో ప్ర‌స్తుతం 91 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇక ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా మొద‌లుపెట్టిన ఈ యుద్ధం 11వ రోజుకు చేరింది. ఇరాన్ సైనిక‌స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఇజ్రాయెల్‌, అమెరికా సేన‌లు విరుచుకుప‌డుతున్నాయి. మ‌రోవైపు లెబ‌నాస్‌పై కూడా ఇజ్రాయెల్ త‌న దాడుల‌ను కొన‌సాగిస్తోంది. ఇరాన్ సైతం ప్ర‌తిదాడుల‌తో విరుచుకుప‌డుతోంది.

యుద్ధానికి మేం ఎండ్‌కార్డ్ వేస్తాం.. ఇరాన్‌

మ‌రోవైపు ఇరాన్‌లో యుద్ధాన్ని (Iran War) ముగిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యల‌పై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో డిసైడ్ చేసేది అమెరికా కాద‌ని.. తామే అని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ (Islamic Revolutionary Guard Corps) తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ ల‌క్ష్యాల‌పై సైనిక చ‌ర్య‌ల‌ను ఎప్పుడు ఆపాలో తామే నిర్ణ‌యిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ప్రాంత భ‌విష్య‌త్తు టెహ్రాన్ ద‌ళాల చేతుల్లోనే ఉంద‌ని తెలిపింది. "ఈ యుద్ధం ఎప్పుడు ముగించాలో మేమే నిర్ణయిస్తాం. ఈ ప్రాంత సమీకరణాలు, భవిష్యత్తు స్థితిగతులు ఇప్పుడు మా సాయుధ దళాల చేతుల్లో ఉన్నాయి. అమెరికా దళాలు ఈ యుద్ధాన్ని ముగించలేవు" అని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.

యుద్ధం నుంచి వైదొలుగుదాం..

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా నేత‌లు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం కార‌ణంగా చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డ‌మేకాకుండా.. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ స‌ల‌హాదారులు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు యుద్ధం నుంచి వెంటనే వైదొలగాలని ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతున్నార‌ట‌. ఈ మేర‌కు వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ (Wall Street Journal) సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నుండి వెదొలిగేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించాలని ట్రంప్‌కు ఆయన సలహాదారులు సూచిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. దీర్ఘ‌కాలిక యుద్ధం వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను నివారించ‌డంతోపాటూ ఈ సంఘ‌ర్ష‌ణ‌ను విజ‌య‌వంత‌మైన ఆప‌రేష‌న్‌గా ముగించ‌డం మంచిద‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొంది. అందుకే యుద్ధం నుంచి వైదొలిగేందుకు వ్యూహాన్ని రూపొందించాల‌ని అధ్య‌క్షుడిపై ఒత్తిడి చేస్తున్న‌ట్లు స‌దరు నివేదిక వెల్ల‌డించింది. ఇరాన్‌కు చెందిన కీల‌క సైనిక సామర్థ్యాలను ఇప్పటికే దెబ్బతీశామని, దీన్ని "విజయవంతమైన మిషన్" (Successful Mission)గా ప్రకటించి సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని వారు సూచిస్తున్నట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ నివేదించింది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, ఇది రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి దెబ్బ కొడుతుందని వారు హెచ్చరిస్తున్నార‌ట‌.

ట్రంప్ ప్ర‌క‌ట‌న‌లు ఇలా..

ఈ ఒత్తిళ్ల నేప‌థ్యంలో యుద్ధంపై ట్రంప్ విరుద్ధ ప్ర‌క‌ట‌నలు చేశారు. సైనిక చ‌ర్య చివ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ని, అనుకున్న‌దానికంటే ముందే యుద్ధాన్ని ముగిస్తామ‌ని వ్యాఖ్యానించారు. మిలిట‌రీ ప‌రంగా సాధించాల్సిన ల‌క్ష్యాల‌ను దాదాపుగా పూర్తి చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అతి త్వరలో యుద్ధానికి ముగింపు పలుకుతామని ట్రంప్ ధీమా వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వ‌ర‌కూ యుద్ధం కొన‌సాగిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read..

ఎల్పీజీ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌.. ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మావేశం

అప్పుడు తెలుగులో - ఇప్పుడు బాలీవుడ్‌లో - మృణాల్‌కు మ‌రోసారి షాకిచ్చిన య‌శ్‌

రేవంత్ రెడ్డి గారూ.. మీరు అలా చేస్తే గాంధీ కీర్తి దెబ్బ‌తింటుంది : తుషార్ గాంధీ

Advertisement
Advertisement