త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | అప్పుడు తెలుగులో – ఇప్పుడు బాలీవుడ్‌లో – మృణాల్‌కు యశ్ డబుల్ షాక్

మృణాల్ ఠాకూర్‌కు రెండోసారి క‌న్న‌డ హీరో య‌శ్ షాకిచ్చారు. టాక్సిక్‌తో బాక్సాఫీస్ క్లాష్ కార‌ణంగా మృణాల్ ఠాకూర్ తెలుగు మూవీ డెకాయిట్ వాయిదాప‌డింది. తాజాగా మృణాల్ హిందీ మూవీ హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై రిలీజ్ డేట్ కూడా య‌శ్ సినిమా వ‌ల్లే మారింది.

N

News | Published On Mar 10, 2026, 3.50 pm IST

Mrunal Thakur | అప్పుడు తెలుగులో – ఇప్పుడు బాలీవుడ్‌లో – మృణాల్‌కు యశ్  డబుల్ షాక్
Advertisement

Mrunal Thakur |  య‌శ్ టాక్సిక్‌తో బాక్సాఫీస్ పోటీ కార‌ణంగా మృణాల్ ఠాకూర్‌, పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై పోస్ట్‌పోన్ అయ్యింది. జూన్ 5 రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వారం ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ మంగ‌ళ‌వారం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టించాడు. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ డేవిడ్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

య‌శ్ టాక్సిక్‌...

జూన్ 5న హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ చాలా రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించారు. కానీ అనూహ్యంగా య‌శ్ టాక్సిక్ మూవీ రేసులోకి రావ‌డంతో ఈ బాలీవుడ్ మూవీ రిలీజ్ డైల‌మాలో ప‌డింది. య‌శ్ టాక్సిక్ మూవీ మార్చి 19న రిలీజ్ కావాల్సింది. కానీ ఇరాన్‌, ఇజ్రాయెల్ వార్ కార‌ణంగా ఈ మూవీని జూన్ 4కు వాయిదావేశారు. టాక్సిక్‌కు పాన్ ఇండియ‌న్ వైడ్‌గా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాతో పోటీ ప‌డితే త‌మ‌కే న‌ష్ట‌మ‌ని భావించిన హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై మేక‌ర్స్ రిలీజ్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు. పోస్ట్‌పోన్‌కు గ‌ల కార‌ణాల‌ను ప్ర‌క‌టించారు.

పోటీప‌డ‌టం కంటే...

ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలు, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని విడుద‌ల తేదీని మార్చామ‌ని అన్నారు. ఒకే తేదీన ఒక‌రి సినిమాతో మ‌రొక‌రు పోటీప‌డ‌టం కంటే ఇండ‌స్ట్రీలోని నిర్మాత‌ల‌కు ఒక‌రికొక‌రు స‌పోర్ట్ చేసుకోవ‌డ‌మే మంచిది. సినీ ప‌రిశ్ర‌మ‌కే కాకుండా వ్య‌క్తిగ‌త నిర్మాత‌ల‌కు లాభ‌దాయ‌కంగా ఉంటుంది. అందుకే మా సినిమాను జూన్ 5న కాకుండా జూన్ 12న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

రెండో సినిమా....

టాక్సిక్ కార‌ణంగా వాయిదాప‌డిన మృణాల్ ఠాకూర్ రెండో సినిమా ఇది. మార్చి 19న టాక్సిక్‌తో పాటు మృణాల్ ఠాకూర్ తెలుగు మూవీ డెకాయిట్ రిలీజ్ కావాల్సింది. టాక్సిక్ లాంటి పెద్ద సినిమాతో పోటీ అంటే రిస్క్ అనే ఆలోచ‌న‌తో డెకాయిట్ మేక‌ర్స్ వెన‌క్కి త‌గ్గారు. విడుద‌ల తేదీని ఛేంజ్ చేశారు. చివ‌ర‌కు మార్చి 19 రేసు నుంచి టాక్సిక్ కూడా త‌ప్పుకుంది. ఇప్పుడు మృణాల్ మ‌రో బాలీవుడ్ మూవీ కూడా టాక్సిక్ కార‌ణంగానే వాయిదాప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
కాగా మృణాల్ ఠాకూర్ గ‌త బాలీవుడ్ సినిమాలు స‌న్నాఫ్ స‌ర్దార్ 2తో పాటు దో దీవానే షెహ‌ర్ మే కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. గ‌త సినిమాల రిజల్ట్‌ల‌తో సంబంధం లేకుండా మృణాల్ ఠాకూర్ తెలుగుతో పాటు హిందీలో ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Advertisement
Advertisement